/rtv/media/media_files/2025/03/16/1eW2tnhaPVgAHLg7A1mK.jpg)
AP Alluri district Lambasingi Horrible road accident
AP Crime: ఏపీ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం లంబసింగి జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఒక బైకుపై వెళ్తున్న ఫ్యామిలీలో భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య, కుమారుడి పరిస్థితి విషమం ఉంది. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో నర్స్‌గా విధులు..
ఇక మరొక బైక్‌పై వేగంగా వచ్చిన యువకుడు కూడా అక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వై. రామవరం ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న హెప్సికను తన భర్త ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం చెందారు. పాతపట్నానికి చెందిన పెద్దగోపు వెంకటప్రసాద్, భార్య వాణి శ్రీకాకుళంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొన్నారు. అనంతరం కుమారుడితో పాటు మరో ఇద్దరితో కలిసి పాతపట్నానికి కారులో బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు ను సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!