/rtv/media/media_files/2025/02/13/9MwpeoY0rKHY0I1PyGF9.jpg)
Anantapur Madakashira CI Ramaiah suspended
AP Crime News: ఏపీ అనంతపురం(Ananthapuram) మడకశిర సీఐ రామయ్య(CI Ramayya)కు ఎస్పీ రత్న(SP Rathna) బిగ్ షాక్ ఇచ్చారు. రామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళా, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బయటపడింది.
Also Read: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
ఆదినుంచి వివాదాస్పదంగానే..
ఈ మేరకు సీఐ రాగిరి రామయ్య తీరు ఆదినుంచి వివాదాస్పదంగానే ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. రాగిరి రామయ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ కు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు గుర్తించారు. సివిల్ వివాదాల్లో తలదూర్చడం, న్యాయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరించినట్లు వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో మడకశిరలో సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన వ్యవహారశైలి మొదటినుంచే వివాదాస్పదంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రంగంలోకి KCR.. ఫిబ్రవరి 19 నుంచి బీఆర్ఎస్ పార్టీ బిగ్ ప్లాన్..!
గిరిజన మహిళతో అసభ్యకరంగా..
అంతే కాకుండా న్యాయం చెయ్యమని పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిపై కూడా దురుసుగా, అమర్యాదగా మాట్లాడుతుండడం మరింత వివాదానికి కారణమైంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ గిరిజన మహిళతో సీఐ అసభ్యకరంగా మాట్లాడటంతో బాధితురాలు ఎస్పీ రత్నను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. స్టేషన్ లోని సీసీ టీవీ ఫుటేజీల పరిశీలనలో బాధితురాలి ఆరోపణలు నిజమని తేలింది. దీంతో సీఐ.. రాగిరి రామయ్యను శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన వీఆర్ కి పంపారు. విచారణ నివేదిక తీసుకొని ఈరోజు సస్పెన్షన్ వేటు వేశారు. గత సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు సీఐపై ఫిర్యాదులు చేశారు. ఇందులో ఓ హిజ్రా కూడా సీఐపై ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: AR Rahman: నోరు తెరిస్తే ఏమవుతుందో.. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా పై వ్యాఖ్యలు
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!