/rtv/media/media_files/2025/01/24/2JIQb9eosm7SEDh7zhgO.webp)
Accident in Rajahmundry Airport
Accident in Rajahmundry Airport: రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది.శుక్రవారం మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్‌లో ఈ ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్‌వైర్ తెగి టెర్మినల్‌లోని నిర్మాణంలో ఉన్న కొంతబాగం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపరిపీల్చుకున్నారు.ఆ సమయంలో కార్మికులు ఎవరు దగ్గర లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు. కాగా విమానాశ్రయంలో అభివృద్ధి పనుల్లో నాణ్యత పై పర్యవేక్షణ కొరవడంతోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని స్థానికులు అంటున్నారు.
Also Read: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్ వేటు!
రాజమండ్రి ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణానికి సంబంధించి కార్మికులు స్టీల్ తో ప్రత్యేక స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ ఒకసారిగా కింద కూలింది. 2023 డిసెంబర్‌లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. కొత్తగా 17,029 చదరపు మీటర్ల మేర విస్తరిస్తున్నారు. ఇందులో 21,094 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతోంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రతి గంటకూ 2,100 మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయాలనే లక్ష్యంతో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఏడాదికి కనీసం 30 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకుంటారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంచనా. కాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు నియామకం అయ్యాక ఏపీలో నూతన విమానశ్రయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీంతో రాజమండ్రి టెర్మినల్ పనలు వేగవంతంగా సాగతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి నూతన టెర్మినల్ భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రిత్వశాఖ భావిస్తోంది.
Also Read: రాజకీయనాయకుడికి బినామీ ఝలక్...వెయ్యికోట్లతో పరారీ...
ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా..
టెర్మినల్ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే అధికారులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనలో గాయపడిన కార్మికుడిని రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.
Also Read: భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!
Also Read: నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!