Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్..

ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు.

New Update
Houthis : హౌతీలపై భూతల దాడులకు పిలుపునిచ్చిన యెమెన్..

Yemen : ఎర్ర సముద్రం(Red Sea) లో నౌకలపై హౌతీ(Houthi) తిరుగుబాటుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై తిరుగుబాటు చేసేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. హౌతీలపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్(Yemen) డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. అయితే ఎడెన్ పోర్టు ప్రాంతంలో అమెరికా నౌకపై క్షిపణులతో దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం ప్రకటన చేశారు.

విదేశీ సాయం కావాలి

ఈ దాడిపై స్పందించిన అమెరికా(America).. తమకు ఎలాంటి నష్టం కలగలేదని.. ప్రాణ నష్టం జరగలేదని చెప్పింది. ఈ నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు.. అమెరికా, యూకే వైమానిక విమానాలతో పాటు భుతల యుద్ధ చేసేందుకు విదేశీ సాయం అవసరం అవుతుందని ఐదారుస్ అన్నారు. అలాగే ఎర్రసముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్‌(International Navigation) ను సురక్షితంగా ఉంచేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరమవుతుందని తెలిపారు.

Also Read : Akasa Air : బోయింగ్ విమానాలకు భారీగా ఆర్డర్ చేసిన అకాసా ఎయిర్ లైన్స్

దాడులు కొనసాగిస్తాం

మరోవైపు హౌతీ రెబెల్స్ చేస్తున్న దాడులపై ప్రతీకార చర్యలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇప్పటివరకు అమెరికా, బ్రిటిష్ సైన్యాలు చేసిన దాడులు హౌతీలను ఆపలేకపోయాయని తెలిపారు. మరోవైపు హౌతీ రెబెల్స్‌ నాయకుడు అబ్దెల్‌ మాలెక్‌ అల్-హౌతీ.. ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ మీదుగా ప్రయాణించే నౌకలపై తమ దాడులు జరుగుతూనే ఉంటాయని గురువారం ఓ వీడియో సందేశంలో ప్రకటన చేశాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో చిక్కుకుపోయిన హమాస్‌, పాలస్తినీయులకు మద్దతు ఇచ్చేందుకే తాము ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపాడు.

హౌతీలను ఆపేందుకు ప్రయత్నాలు

అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్(Israel - Hamas) మధ్య యుద్ధం దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాదిమంది ఈ దాడుల్లో మరణించారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడులకు వ్యతిరేకంగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేయడం మొదలుపెట్టారు. కేవలం ఇజ్రాయెల్ వెళ్లే నౌకలపైనే కాకుండా ఇతర దేశాల నౌకలపై కూడా హౌతీలు దాడులు చేయడం సంచలనం రేపింది. దీంతో అమెరికాతో సహా.. పలు దేశాలు ఏకమై ఎర్రసముద్రంలో హౌతీలు చేస్తున్న దాడులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Also Read : Delimitation : NHPC నుంచి తన వాటాను అమ్ముతున్న ప్రభుత్వం.. వివరాలివే.. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది. 

New Update
F1 Visa

F1 Visa

అమెరికాలో ఉన్నత విద్యకు బోలెడంత డిమాండ్ ఉంది. మన దేశం నుంచి దీని కోసం చాలా మంది వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.  అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాల్లో బాగా కోత పడిపోతోంది.  కొత్తగా వచ్చే అప్లికేషన్లు చాలా మట్టుకు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందినవే ఎక్కువ ఉంటున్నాయని హైదరాబాద్ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు లభించినా..వీసాలు రావడం లేదని చెబుతున్నారు. 

ఏ చిన్న తప్పు ఉన్నా వదలడం లేదు..

అమెరికాలో ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఒప్పుకోలేదు. వాటికి కారణాలేంటనేది కూడా చెప్పడం లేదు. ఏ చిన్న పొపాటు ఉన్నా వదడలడం లేదు..అన్నీ పట్టి పట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదని...ట్రంప్ వచ్చాకనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. విద్యార్థులకు ఇచ్చేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ 1. దీనితో అక్కడ సెటిల్ అవడం కూడా కుదరదు. అయినా కూడా వీసాలను అనుమతించడం లేదు. 

అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం 2023-24 లో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లను నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం చదువు అయిపోయినా కూడా విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోవడం అని చెబుతున్నారు. ఇక్కడ చదువు అవ్వగానే.. ఇక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని విద్యార్థులు అనుకుంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య గ్యాప్ వచ్చినా కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసాలనే తిరస్కరిస్తోంది. మరోవైపు అమెరికాలో సీటు దొరకని స్టూడెంట్స్ అందరూ యూకే, జర్మనీలకు వెళ్ళిపోతున్నారు.

 today-latest-news-in-telugu | usa | student-visa 

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం! 

 

Advertisment
Advertisment
Advertisment