తెలుగు రాష్ట్రాల్లో జీరో డిగ్రీలు.. ఈ జిల్లాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అరకు, లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల్లో జీరో డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

New Update
Weather Alert: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి.. జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన

winter

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 6.1 డిగ్రీలు, కామారెడ్డి డోంగ్లీలో 6.8 డిగ్రీలు, వికారాబాద్‌లో 7.8 డిగ్రీలు, మెదక్ జిల్లా బోడగాట్‌లో 8.4 డిగ్రీలు నమోదయ్యాయి. 

ఇది కూడా చూడండి: TS:  గ్రామ సభల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

ఈ జిల్లాల్లో ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు..

వీటితో పాటు మహబూబ్‌నగర్​ జిల్లా రాజాపూర్‌లో 8.4, నిర్మల్‌లో​8.8, సిద్దిపేటలో 9.2, రాజన్న సిరిసిల్లలో 9.5, మేడ్చల్ మల్కాజిగిరి ఉప్పల్‌లో 9.5, జయశంకర్​ భూపలపల్లిలో 9.8, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 9.9, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 10 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో 10 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

ఇక ఏపీ విషయానికొస్తే.. ఏజెన్సీ ప్రాంతాల్లో జీరో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, లంబసింగి, అరకు ప్రాంతాల్లో 0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జి.మాడుగులలో 8.3 డిగ్రీలు, చింతపల్లిలో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.  

ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు