AP Weather Updates: అందరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ పండగ పూట ఏపీకి బిగ్ షాక్ తగిలింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్! Weather warning for Andhra Pradesh for next five days dated 12-01-2025 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/qv2LZn46bk — MC Amaravati (@AmaravatiMc) January 12, 2025 ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా! తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తన ప్రభావం వల్ల తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఏపీ, యానంలో గాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రేపు కూడా ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా? తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందని.. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పొడి వాతావరణమే ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపు జనవరి 17వ తేదీ వరకు ఇలానే పొడి వాతావరణం ఉండనున్నట్లు తెలిపింది. అయితే రాష్ట్రంలో అక్కడక్కడ ఎక్కువగా పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇది కూడా చూడండి:Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా!