Wolfdog: రాజా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు

బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే.

New Update
_rare wolfdog

_rare wolfdog Photograph: (_rare wolfdog )

కుక్కకు రాజయోగం అంటే ఎప్పుడూ వినడమే కానీ.. ఇప్పటి వరకూ చూడలేదా.. అయితే ఇప్పుడు చూడండి. పెట్ యానిమల్ లవర్స్‌ ఎక్కువగా పెంచుకునేది కుక్కలే. వాటి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. కానీ.. మరీ ఇంతా? బెంగుళూరులో ఓ అదుదైన జాతి కుక్కపిల్లని 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి సతీష్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ కుక్కపిల్ల ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.50 కోట్లు. మరి ఈ కుక్క ప్రత్యేకత ఏంటి. దానికి ఎందుకింత రేటో తెలుసుకుందామా..

Also read: Google: ప్లే స్టోర్‌లో గూగుల్ 331 యాప్స్ రిమూవ్.. అవి మీ ఫోన్‌లో ఉంటే యమ డేంజర్

తోడేలు లాగే ఉండే దీని పేరు వోల్ఫ్‌డాగ్ అంటారు. ఇది రేర్ బ్రీడ్ కుక్కపిల్ల. వోల్ఫ్‌డాగ్ తోడేలు, కాకేసియన్ షెపర్డ్‌కు పుట్టినదే ఈ కుక్క. వీటి మిక్సిడ్ బ్రీడ్ ఫస్ట్ జనరేషన్‌గా దీన్ని నమ్ముతారు. అమెరికాలో పుట్టిన కాడబోమ్స్ ఒకామి అనే కుక్కను బెంగుళూర్‌కు చెందిన సతీష్  కొన్నాడు. ఇది ఎనిమిది నెలల వయసులో కుక్క పిల్ల. చూడడానికి బలిష్టంగా ఉండి నక్కలా ఉంటుంది. దీని బరువు 75 కిలోల పైనే ఉంటుంది. ప్రతిరోజూ 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. సతీష్‌కు కుక్కలంటే ప్రాణం. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. ఈ కుక్కను అమెరికాలో పెంచారు. వోల్ఫ్ డాగ్ అసాధారణమైన బ్రీడ్ అని చెప్పారు. ఇప్పటివరకు ఈ కుక్క ఇండియాలోనే లేదని అన్నారు. ఆయన ఈ కుక్కపిల్లని కొనడానికి రూ.50 కోట్లు ఖర్చు చేశానని చెప్పుకొచ్చాడు.

Also read: Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు