/rtv/media/media_files/c3BXu7xM82FJvlm1mdwl.jpg)
Milk
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇందులో కాల్షియం, పొటాషియం కండరాలను బలంగా ఉంచుతాయి. బోలు ఎముకల వ్యాధి రాకుండా కాపాడతాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పాలను కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసో తెలియక కొందరు పాలను తీసుకుంటారు. వీటివల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే ఎలాంటి సమస్యలు ఉన్నవారు పాలు తీసుకోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
ఈ సమస్యలు ఉన్నవారు పాలను తీసుకుంటే..
పాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి శరీరంలో మంటను పెంచుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య తగ్గకుండా ఎక్కువగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా పాలను ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. పాలలోని లాక్టోజ్ వల్ల కాలేయం దెబ్బతింటుందట.
ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు
అలాగే గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. పాలలోని లాక్టోజ్ ఈ సమస్యలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నిద్రలేమి, చర్మ సమస్యలు ఉన్నవారు కూడా పాలు, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!
latest-telugu-news | health-issues | drinking-milk | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style