Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్

సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్‌ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్‌లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది.

New Update
Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్

Artificial Intelligence: ప్రపంచంలో సాంకేతిక రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌(AI) హవా కొనసాగుతోంది. దీని వాడకం రోజురోజుకి వివరీతంగా పెరుగుతోంది. 2022 నవంబర్‌ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందర్ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇది లాంఛ్ అయిన కొన్ని రోజులకే కోట్లాది మంది యూజర్లు దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇంకా మరికొన్ని సంస్థలు కూడా చాట్‌జీపీటీలా ఏఐతో పనిచేసే మరిన్ని సాప్ట్‌వేర్‌లను అభివృద్ధి చేస్తున్నారు.

Also Read: భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్‌.. ఐదేళ్ల మల్టిపుల్‌ ట్రావెల్‌ వీసా

సైనిక కార్యకలాపాలకు ఏఐని వాడుతున్న అమెరికా

అంతేకాదు అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీని పలు రంగాల్లో వినియోగించేందుకు కూడా కొందరు సుముఖత చూపుతున్నారు. ఇకనుంచి సైనిక కార్యకలాపాల్లో కూడా కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్‌ నివేదిక వెల్లడించింది. అలాగే ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్‌లను గుర్తించేదుకు అమెరికా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సాయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందుకోసం పెంటగాన్‌ కంప్యూటర్‌ విజన్‌ అనే అల్గారిథమ్స్‌ను బరిలోకి దింపినట్లు తెలిపింది.

టార్గెట్‌లపై దాడులు 

అయితే మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 2వ తేదిన ఓ మిషన్‌ చేపట్టిందని.. ఇందులో అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సాయంతోనే 85కి పైగా వైమానిక దాడులు చేసినట్లు పేర్కొంది. ఇప్పుడున్న తాజా సాంకేతికతతో.. సిరియా, ఇరాక్‌లోని రాకెట్స్, మిసైల్స్‌, డ్రోన్‌ స్టోరెడ్‌ లాంటి వాటిని గుర్తించి లక్ష్యాలపై దాడులు చేసినట్లు చెప్పింది. మరోవైపు రక్షణ విభాగంలో ఆటోమేషన్‌ పెంచేందుకు 2017లో ప్రాజెక్ట్‌ మావెన్‌ ఏర్పాటైంది. అయితే ఇందులో భాగంగానే వైమానిక దాడులకు కావాల్సిన అల్గారిథమ్స్‌ను అభివృద్ధి చేసినట్లు అమెరికన్ సెంట్రల్ కమాండ్‌ చీప్‌ టెక్నాలజీ ఆఫీసర్ మూర్ వెల్లడించారు.

Also Read: నైలు నదిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు