/rtv/media/media_files/2LswcIh6YuFLl8YlKNJb.jpg)
Uttar Pradesh ayodhya Woman gang raped
UP Crime: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. మలీహాబాద్‌లో ఓ మహిళ (32)పై సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి కామవాంఛ తీర్చుకున్న దుర్మార్గులు కోరిన తీరిన తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశారు. ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఆలంబాగ్‌లో ఆటో ఎక్కగానే..
ఈ మేరకు అయోధ్యలో ఉంటున్న ఓ మహిళ వారణాసిలో ఓ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరైంది. అనంతరం బుధవారం తెల్లవారుజామున మలీహాబాద్‌లోని తన సోదరుడి ఇంటికి వెళుతుండగా.. మార్గమధ్యంలో ఆమె ఆలంబాగ్‌లో ఆటో ఎక్కింది. దీంతో ఆటో డ్రైవరు దారి మళ్లించి మలీహాబాదుకు తీసుకువెళ్లాడు. అయితే ఎంతసేపటికి ఆమె ఇంటికి రాకపోవడంతో సోదరుడికి అనుమానం వచ్చింది. లైవ్ లొకేషను షేర్ చేసిన ఇంటికి రాకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా మలీహాబాద్ సమీపంలోని మామిడితోటలో ఆమె అపస్మారక స్థితిలో కనిపించినట్లు డీసీపీ కమలేశ్ కుమార్ దీక్షిత్ తెలిపారు.
Also read : నా కూతురిపై గ్యాంగ్ రేప్ .. ఆదిత్య ఠాక్రే కారణమంటూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నామని, వీలైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.
Also read : కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగ్న వీడియోలను ఉపయోగించి విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేశాడని, అలాగే లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ పై ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి పరారీలో ఉన్నాడు, విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు పోలీసులకు చేరాయి.
uttara-pradesh | rape | women | today telugu news | latest-telugu-news