/rtv/media/media_files/2025/03/23/FsvD78ObRR08sRF3ZYn6.jpg)
UP Constable wife illicit relationship murder case
Kakori Double Murder Case: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కాకోరి ప్రాంతంలో హృదయ విదారక డబుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. ఈ సంఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుండగా.. హత్యకు పాల్పడింది ఓ కానిస్టేబుల్ కావడం విశేషం. నిందితుడైన కానిస్టేబుల్, అతని భార్యను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది.
ప్రేమికుడి వద్దకు వెళ్ళమని చెప్పి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడిగా మహేంద్ర కుమార్‌గా గుర్తించారు. అతను ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లఖింపూర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. 2018 సంవత్సరంలో దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతని భార్యకు అప్పటికే మనోజ్ అనే వ్యక్తితో సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా మనోజ్, దీపికల సంబంధం కొనసాగుతోంది. ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. తమ భార్య ప్రేమ వ్యవహారం గురించి కానిస్టేబుల్ మహేంద్ర కుమార్ తెలుసుకున్నాడు. ఆమెతో గొడవపడి డివోర్స్ ఇస్తానన్నాడు. కానీ ఇందుకు ఆమె అంగీకరించలేదు. ప్రేమికుడి వద్దకు వెళ్ళమని అడిగాడు. కానీ దీపిక అతన్ని విడిచిపెట్టడానికి నిరాకరించింది. దీంతో తన ప్రేమికుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. మనోజ్ తన స్నేహితుడితో ఆమెను కలవడానికి ఇంటికి రావడంతో దారుణం జరిగింది.
Also read: నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR
అప్పటికే మద్యం మత్తులో ఉన్న మహేంద్ర.. మనోజ్, అతని స్నేహితుడిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘోరమైన దాడిలో ఆ ఇద్దరు యువకులు మరణించారు. నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు యువకులు రక్తంతో తడిసి పడి ఉన్నారు. వారిలో ఒకరి గొంతు కోసి, మరొకరి మణికట్టు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడి బంధువులు గొడవకు దిగి నిరసన చేపట్టారు. పోలీసులు విషయాన్ని వివరించి శాంతింపజేశారు. యువకుల మృతదేహాలను పోస్ట్ మార్టం చేయించి మృతదేహాలను ఇంటికి పంపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన కానిస్టేబుల్, అతని భార్యను అరెస్టు చేశారు.
Also read: Meerut Murder case: జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్
conistable | wife | telugu-news | today telugu news | latest-telugu-news