Crime: అయ్యో బిడ్డా.. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన దుర్మార్గుడు!

హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ రియా కుమారి చనిపోయింది. నిందితుడు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన హేమ్‌బ్రోమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
wife murdered husband

Hyderabad Psycho kills four-year-old child

Crime: హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. ఇన్ఫోసిస్ సమీపంలో కల్పదరు ప్రాజెక్టులో లేబర్ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటోంది నాలుగేళ్ల చిన్నారి రియా కుమారి. అయితే అక్కడికి వచ్చిన వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైకో హేమ్ బ్రోమ్ అతి దారుణంగా బీరు సీసాతో దాడి చేశాడు.

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి 

తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగింత..

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు చెప్పగానే హుటాహుటిన తీవ్ర గాయాలైన చిన్నారి రియా కుమారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ చిన్నారి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక దాడి అనంతరం పారిపోతున్న సైకోను స్థానిక ప్రజలు వెంటాడి పట్టుకుని చితిక బాదారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గాయాలపాలైన సైకో హెమ్ బ్రోమ్ ను ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

 hyderabad | children | murder | today telugu news | rtv telugu news

Advertisment
Advertisment
Advertisment