Madhya pradesh 12 year girl rape case:మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన బాలిక ఘటన....నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఉజ్జయినిలో రక్తమోడుతూ సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాలిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. సిగ్గుతో తలదించుకునే చేసిన ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురిని అదుపోలకి తీసుకుని విచారిస్తున్నారు.

New Update
Madhya pradesh 12 year girl rape case:మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన బాలిక ఘటన....నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

12 బాలిక హత్యాచారానికి గురయింది. అదే ఘోరం అంటే...ఆ బాలిక సాయంకోసం అడుగుతున్న ఆఎవ్వరూ ముందు రాకపోవడం మరింత ఘోరం. రక్తంతో, నొప్పితో విలవిలలాడుతూ 8 కి.మీ నడిచిందా అమ్మాయి. సభ్య సమాజం తలదించుకునేలా, సిగ్గు చేటుగా మిగిలిన ఈ ఘటనలో పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. విచారణను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన ఈఘటనలో బాలికను అత్యాచారం చేసింది రాకేష్ అనే ఆటో డ్రైవర్ గా గుర్తించారు పోలీసులు. అతని ఆటోలో రక్తపు మరకగలను కూడా నోటీస్ చేశామని తెలిపారు. ఇతనితో పాటూ అరెస్ట్ అయిన మరో ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లే అని తేలింది. బాధితురాలు జీవన్ ఖేరీ ప్రాంతంలో రాకేష్ ఆటో ఎక్కిందని...అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ కూడా దొరికిందని పోలీసులు చెబుతున్నారు.

బాధతో అర్ధనగ్నంగా నడిచిన బాలికను రాహుల్ శర్మ అనే పూజారి రక్షించారు. ఆమెకు బట్టలు ఇచ్చి, ఆసుపత్రికి తరలించారు. ఆయనే ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బాలిక మీద అత్యాచారం జరిగిందని తెలియగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ ఘటన మీద సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం బాలిక ఇండోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణానికి ఏం ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోమంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.

ఇక అత్యాచారానికి గురైన బాలిక ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమ్మాయిగా గుర్తించారు. తీవ్రమైన షాక్ లో ఉన్న ఆ అమ్మాయి తాను ఎక్కడ నుంచి వచ్చిందో, తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోతోంది. ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

New Update
Honey Bees Attack

Honey Bees Attack

ఏపీలోని పార్వతీపురంలో దారుణం జరిగింది. పెళ్లి కోసం వెళ్లిన జనాలు.. చావు అంచుల వరకు వెళ్లారు. ఊరు ఊరంతా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. దీంతో పదుల సంఖ్యలో పెళ్లి బృందం హాస్పిటల్‌పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ తేనెటీగల దాడిలో సుమార్ 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే బాధితుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పెళ్లి వారు.. హాస్పిటల్‌లో నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

గతంలో చావు దగ్గర సంఘటన

ఏపీలోని అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే శవాన్ని పాడెపై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చారు. 

దీంతో అందులో కొన్ని టపాకాయలు పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. సరిగ్గా అక్కడే తేనెతుట్టు ఉండటంతో దానికి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అంతిమయాత్రలో ఉన్న వారిపై ఏకదాటిగా దాడి చేశాయి. దీంతో అంతిమయాత్రలో పాల్గొన్నవారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు పెట్టారు. 

ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని గౌరీదేవి పేట PHCకి తరలించి చికిత్స అందించారు. ఇంకొంతమంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ తేనెటీగల దాడి అనంతరం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఈ ఘటనతో చాలా మంది ఉలిక్కి పడ్డారు. చావుకు వెళ్తే చచ్చేంత పనైందిరా బాబు అంటూ పలువురు బందువులు మాట్లాడుకున్నారు. 

Honey Bees Attack | latest-telugu-news | telugu-news | viral-news

Advertisment
Advertisment
Advertisment