Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు

గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు.

author-image
By Kusuma
New Update
Horoscope

Horoscope

ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. కొన్ని గ్రహాలు స్థానాలు మార్చుకోవడం వల్ల కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం. 

మకర రాశి

కొత్త ఏడాది నుంచి ఈ రాశి వారికి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. జీవితంలో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. కుటుంబంతో సంతోషం ఏర్పడుతుంది. ఎలాంటి గొడవలు కూడా ఇకపై ఉండవు.

ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్‌ విక్టరీ

కన్య రాశి
ఈ రాశి వారికి ఇకపై అన్ని పనులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇన్ని రోజుల నుంచి ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఇకపై మంచి కాలం. అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఏర్పడుతుంది. 

ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

ధనుస్సు రాశి
కొత్త పరిచయాల వల్ల ఈ రాశి వారికి బాగుంటుంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. 

వృషభ రాశి
కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి గౌరవం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. 

మిథున రాశి 
శని, గురు సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా మంచి లాభాలు పొందుతారు. అలాగే వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

 

ugadi-pachadi | ugadi-festival | UGADI 2025 | ugadi-panchagam | zodiac-signs | astrology | daily-life-style | human-life-style | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhringaraja Oil: చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫేస్ క్రీముల, జుట్టు సంరక్షణ షాంపూలు, నూనెలు వాడుతారు. బృంగరాజ నూనె జుట్టు పెరుగుదల, చర్మానికి పోషణను అందించడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. తులసి సీరం, వేప, టీ ట్రీ ఆయిల్, కలబంద మొటిమలు, చర్మాన్ని రక్షిస్తోంది.

New Update

Bhringaraja Oil: ఇటీవలి కాలంలో మహిళలు ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఆయుర్వేద ఉత్పత్తులకు అధిక డిమాండ్ కూడా ఏర్పడింది. ఆయుర్వేద ఉత్పత్తులలో ఎటువంటి రసాయనాలు ఉండవు కాబట్టి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ రకాల ఫేస్ క్రీముల నుండి జుట్టు సంరక్షణ షాంపూలు, నూనెల వరకు అనేక రకాల ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. బృంగరాజ మొక్కను గరుగాకు అని కూడా పిలుస్తారు. ఇది జుట్టు పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 

చర్మానికి పోషణ...

ఈ భృంగరాజం ఏ ఆయుర్వేద జుట్టు ఉత్పత్తిలోనైనా ఉంటుంది. తలకు భృంగరాజ నూనెను పూయడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉబ్తాన్ అనేది మూలికలు, ధాన్యాలు, పసుపు పొడి మిశ్రమం. దీనిని భారతదేశంలో సహజ సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. ఈ ఉబ్తాన్ పౌడర్‌ను పాలు, తేనె లేదా రోజ్‌ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. చర్మ సౌందర్యాన్ని సహజ పద్ధతిలో కాపాడుకోవడానికి ఉబ్టాన్ పౌడర్‌ను క్రమం తప్పకుండా వాడాలి. కుంకుమది బాడీ లోషన్‌లో ఎర్ర చందనం, బాదం నూనె వంటి సహజ పదార్థాలు ఉంటాయి. ఇది చర్మానికి పోషణను అందించడంలో సహాయపడుతుంది. ఇందులో కొవ్వు ఉండదు కాబట్టి ఇది రోజువారీ వాడకానికి అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: పాప్‌కార్న్ తింటున్నారా.. దాని ప్రయోజనాలు తెలుసా?

ఈ బాడీ లోషన్ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. తులసి నూనె అనేది సాంప్రదాయ ఆయుర్వేద జుట్టు నూనె. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బలమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది. తులసి సీరం అనేది ఆయుర్వేద చర్మ సంరక్షణ ఉత్పత్తి. ఇది మొటిమల మంటలను తగ్గించడానికి, కొత్త మొటిమల పెరుగుదలను ఆపడానికి సహాయపడుతుంది. ఈ సీరంలో తులసి, వేప, టీ ట్రీ ఆయిల్, కలబంద వంటి సహజ పదార్థాలు ఉంటాయి. మొటిమల నుండి చర్మాన్ని రక్షించడానికి ఇది మంచి ఆయుర్వేద ఉత్పత్తి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కంటిలో దుమ్ము పడితే రుద్దకుండా ఇలా చేయండి

( hair | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment