/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-13-20-02.jpg)
Malkajgiri CP Sumati in disguise.. 40 hooligans caught!
భాగ్యనగర నడిబొడ్డున ఒక ఐపీఎస్ అధికారిణి(ips-officer) చేపట్టిన సాహసోపేతమైన 'సీక్రెట్ ఆపరేషన్'(Secret operation) ప్రస్తుతం ప్రతి మహిళలోనూ ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిణి తన హోదాను పక్కన పెట్టి, సామాన్య మహిళగా రోడ్డుపైకి వచ్చి ఎదుర్కొన్న చేదు అనుభవాలు, సమాజంలో మహిళల భద్రత ఎంతటి సవాలుగా మారిందో అద్దం పడుతున్నాయి. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన పూర్తి వివరాలు మీకోసం..
Also Read : నగరంలో మరో మూడు కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా?
Malkajgiri CP Sumati In Disguise
వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులు
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026
దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్
కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు
అర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్… pic.twitter.com/aKJcRbQxRK
నగరంలో అర్ధరాత్రి వేళ మహిళలు ఎంతవరకు క్షేమం? కేవలం నివేదికలు చూసి నిర్ణయించకుండా, స్వయంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్(Malkajgiri Police Commissioner) సుమతి(sumathi ips). ఫలితంగా పుట్టుకొచ్చిన ఈ ఆపరేషన్, అల్లరి మూకల అరాచకాలను బట్టబయలు చేసింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయం.. నగరం నిద్రపోతున్న వేళ, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఒక మహిళ సాధారణ దుస్తుల్లో బస్సు కోసం నిల్చుంది. ఆమె మరెవరో కాదు, ఐపీఎస్ అధికారిణి సుమతి. రక్షణ కవచం లాంటి ఖాకీ యూనిఫాం లేదు, వెంట సెక్యూరిటీ లేదు. ఆ సమయంలో ఆమెను చూసిన పోకిరీలు, ఆమెను ఒక ఉన్నత అధికారిణిగా కాకుండా, కేవలం ఒక 'అబల'గా చూశారు.
Also Read : ఆజాద్ పేరిట జాదు లీలలు.. సంచలన విషయాలు వెలుగులోకి..
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. "వస్తావా? రేటెంత?" అంటూ అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించారు. దారి వెంట వెళుతుంటే బైక్‌తో వెంబడించారు. అయినా ఆమె ఏ మాత్రం ధైర్యం చెడకుండా తెల్లవారుజామున 3:30 వరకు ఆమె అక్కడే ఉండి, ప్రతి ఒక్క పోకిరీ ప్రవర్తనను గమనించారు. ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ 40 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పట్టుబడిన వారిలో అధిక శాతం విద్యార్థులు, ఉద్యోగులే కావడం గమనార్హం. వీరిలో కొందరు గంజాయి, మద్యం మత్తులో తూగుతూ విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు.
ఈ ఆపరేషన్ కేవలం నేరస్థులను పట్టుకోవడం కోసం మాత్రమే కాదు, వ్యవస్థలో మార్పు కోసం చేసిన ఒక యుద్ధం. ఈ ఘటన మనకు కొన్ని కీలక పాఠాలను నేర్పుతోంది. అని మహిళా లోకానికి స్ఫూర్తి -నింపేలా సందేశమిచ్చారు సుమతి ఐపీఎస్.
ఒక ఐపీఎస్ అధికారిణినే అంతలా వేధించారంటే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి? అందుకే, ఎక్కడైనా వేధింపులు ఎదురైతే భయపడి వెనకడుగు వేయకుండా, గొంతు ఎత్తాలని ఈ ఘటన చాటిచెబుతోంది. తన కార్యాలయంలో కూర్చోకుండా, అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి సామాన్యుల బాధను పంచుకున్న సుమతి, నిజమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ (SHE Teams), 100 వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని, ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని ఈ ఆపరేషన్ భరోసా కల్పిస్తోంది.
చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగం చేస్తున్న యువకులు ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం విచారకరం. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినప్పటికీ, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. రాత్రివేళల్లో రోడ్డుపై ఒంటరిగా ఉన్న మహిళను చూస్తే 'రక్షణగా నిలబడాలి' అనే సంస్కృతి రావాలి తప్ప, 'వేధించాలి' అనే వికృత ఆలోచన రాకూడదు.
సలాం సుమతి మేడం! మీ సాహసం ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్ర్యం అన్న గాంధీజీ మాటలను నిజం చేసే దిశగా ఇదొక గొప్ప అడుగు.
Follow Us