/rtv/media/media_files/2025/03/15/aMqfggfiqtzIA1O3P8dW.jpg)
VC Sajjanar serious warning to YouTuber Harsha Sai after sharing video
ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు మాజీ ఐపీఎస్, ప్రస్తుత టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి.. గేమింగ్ యాప్‌లను ఇప్పటి వరకు ఎవరెవరు ప్రమోట్ చేశారో వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
ఇప్పటికే వైజాగ్ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బండాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టడంతో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అలాగే తాజాగా బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఆయన రియాక్ట్ అవ్వడంతో సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా.. వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
నెక్స్ట్ టార్గెట్ హర్షసాయి
ఈ క్రమంలో వీ.సీ సజ్జనార్ మరో పాపులర్ యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు. ఈ మేరకు ఫాలోవర్స్ అందరూ హర్షసాయి లాంటి వారిని అన్‌ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
‘‘చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు.
ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.’’ అని ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025
ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.… pic.twitter.com/h0Vyxl2vXh
కాగా సజ్జనార్ దెబ్బకు ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ఇక సజ్జనార్ లిస్టులో సురేఖవాణి కూతురు సుప్రియ, వినయ్ కుయ్యా, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, డేర్ స్టార్ గోపాల్, విజ్జు గౌడ్, శ్రీధర్ చాప వంటి యూట్యూబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ యూట్యూబర్లు వరుసగా అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.