/rtv/media/media_files/2025/02/17/Cs6yOr8elWptySkkdnLr.jpg)
V.C Sajjanar shared viral video parents must watch
సాధారంగా కొన్ని వీడియోలు చూస్తే వావ్, అద్భుతం అని అనకమానలేం. కానీ ఇంకొన్ని వీడియోలు మాత్రం చూసిన కొద్ది సెకన్లకే గుండె పగిలేంత పని అవుతుంది. అందులో ముఖ్యంగా యాక్సిడెంట్ వీడియోలు. తరచూ ఏదో ఒక చోట రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారుతుంటాయి.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
తాజాగా అలాంటిదే ఒక వీడియో (Video) నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అంతా దేవుని దయ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెప్ప పాటులో పోయే ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడాడో అంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. ఆ వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే..
రెప్పపాటులో ఘోర ప్రమాదం
అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 16, 2025
చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు. pic.twitter.com/p6VCewnMwl
వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.. ఒక తండ్రి తన కూతురు కొడుకుతో కలిసి బయటకు వెళ్లేందుకు స్కూటీపై కూర్చొన్నాడు. అందులో కూతురుని వెనుకవైపు కూర్చోబెట్టాడు. ఇక కొడుకును ముందువైపు కూర్చోబెట్టుకునే లోపు ఆ బాలుడు రోడ్డువైపు పరుగులు పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో అటువైపు నుంచి స్పీడుగా ఒక లారీ వచ్చింది. దీంతో లారీ చక్రాలకు.. ఆ బాలుడికి చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. రెప్పపాటులో ఆ బాలుడు బయటపడ్డాడు. ఆ సంఘటన కల్లారా చూసిన తండ్రి ఒక్కసారిగా తలపట్టుకుని ఉండిపోయాడు.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఎండీ వి.సి సజ్జనార్ (V.C. Sajjanar) తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశారు. అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ మేరకు చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు అంటూ ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.