Telangana: హైదరాబాద్‌లో రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
US Consulate road in Hyderabad to be named after Donald Trump

US Consulate road in Hyderabad to be named after Donald Trump

రేవంత్(cm revanth) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌(hyderabad) లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. ORR వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డుకు రతన్‌ టాటా(ratan-tata) పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇటీవలే రావుర్యాల ఇంటర్‌ ఛేంజ్‌కు టాటా ఇంటర్‌ఫేజ్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓ రోడ్డుకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) పేరు పెట్టాలని యోచిస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచు వెళ్లే ప్రధాన రోడ్‌కు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు పెట్టాలని ప్రతిపాదన కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.  

Also Read: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

Hyderabad Road Names Tobe Tata And Trump

దీనిపై చివరి నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అలాగే అమెరికా ఎంబసీకి ప్రభుత్వం లేఖలు రాయనుంది. ఇక ఐటీ కారిడర్‌లో చూసుకుంటే పలు రోడ్లకు గూగుల్‌ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్‌ రోడ్‌తో విప్రో జంక్షన్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావిత వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రోడ్లకు పెట్టడం వల్ల వారికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని.. అలాగే హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు సైతం వస్తుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణించే వాళ్లకు కూడా ఈ పేర్లు స్పూర్తిమంతంగా ఉంటాయని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసింది. 

Also Read: ఇండిగో సంక్షోభం, ప్రయాణికులకు రూ.610 కోట్ల రీఫండ్.. కేంద్రం కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు