TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025

ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు  తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.

New Update
TS Cabinet : ఈనెల 12న మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.!

 మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు  తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మా కింద ఉన్న మహిళా సంఘాలు ఇకనుంచి ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని తీర్మానం చేసింది.  మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు కుదించింది. అలాగే సంఘాల్లో కొనసాగడానికి గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచారు. అలాగే 2024 పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి ప్రభుత్వం ఉద్యోగ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 

టూరిజం పాలసీ..

దాంతో పాటూ పలు నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025 - 2030 మధ్య ఐదేళ్లకు గాను టూరిజం పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రాంతాలను ప్రత్యేక టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దడం.. ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడంలో 15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులను రాబట్టేలా పాలసీలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించారు. ఇక మే నెలలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.  

10,954 గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియమించాలని నిర్ణయించారు. పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయింపు.. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులకు అనుమతి.. అలాగే, గురుకులాలకు మరో 330 పోస్టుల భర్తీకి అనుమతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీ నుంచి 1.28 టీఎంసీకి తగ్గించాలని నిర్ణయాలను తీసుకుంది రాష్ట్ర కేబినెట్. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి  నాయకత్వంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానం చేశారు. పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా ఉద్దేశంతో అఖిల పక్ష సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను కేంద్రానికి నివేదించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో 30 వేల లిస్ట్ రిలీజ్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో విడతలో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయనుంది.  

New Update
Indiramma House

Telangana Indiramma House

Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో  విడతో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి వివరాలను సేకరిస్తోంది.  

మొత్తం 72 వేల మంది లబ్ధిదారులు..

ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయగా.. మొత్తం 72 వేల మంది లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశారు. కానీ మొదటి విడతలో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులోనూ చాలా మంది అనర్హులు ఉన్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో 42 వేల మందికే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా.. ఇప్పుడు మిగిలిన 30 వేల మంది వివరాలను సేకరిస్తున్నారు. రెండో జాబితాలో తప్పులు జరగకుండా చూసి ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

ఇక రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా లిస్ట్ తయారు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను కాకుండా మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు జాబితాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సలహాలు కూడా తీసుకుంటున్నారు. మొత్తం రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా తయారు చేస్తున్నారు.  తుది లిస్టును ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు సమాచారం. 

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

 telangana | cm revanth | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment