/rtv/media/media_files/2025/03/01/lkKEokEDI4HBU9r0KdTB.jpg)
Anganwadi centres
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా తెలంగాణ మహిళలకు,మహిళా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8న మహిళల కోసం నాలుగు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క ఇవాళ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీతక్క ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Posani Arrest: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు సంబంధించి పలు పథకాలను ప్రారంభించనున్నారని తెలిపారు. మహిళా సంఘాలకు కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభిస్తారని సీతక్క తెలిపారు. మొదటి విడతలో 50 బస్సులకు సీఎం పచ్చజెండా ఊపుతారన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల మంజూరుచేయడంతోపాటు, 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన, 14 వేల అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఇందిరా మహిళా శక్తి- 2025 రిలీజ్ చేస్తారని మంత్రి సీతక్క తెలిపారు.
Also Read : మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా?
కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు ఆమోదం
వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు, 13 గిరిజన తాండాల పరిధిలోని దాదాపు నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందించే కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఆదివారం సర్వే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.ఈ లిప్ట్ ఇరిగేషన్ కింద కాశీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తయిపల్లి, అంజనగిరి గ్రామాలతోపాటు మరో 13 గిరిజన తాండాల పరిధిలోని నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది.
Also Read: మట్టి దిబ్బకింద నలుగురు - టన్నెల్ బోర్ కింద మరో నలుగురు!
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (Lift Irrigation) సహా ఇతర ప్రతిపాదిత నీటి వనరులకు ఈ ప్రాంతం ఎత్తుగా ఉండటం వల్ల కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారని ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షులు చిన్నారెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగు నీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం వనపర్తిలో జరిగే బహిరంగ సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.
Also read : SLBC: లోపల కార్మికులు బతికే ఉన్నారా? లేదా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన!