/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T162538.691.jpg)
TG Group-1: తెలంగాణలో మరోసారి గ్రూప్-1 ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. మార్చి 10న టీజీపీఎస్సీ గ్రూప్-1 తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు 530కి పైగా మార్కులు వస్తే తెలుగు మీడియం వారికి కనీసం 400 మార్కులు దాటక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మాతృభాష అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లిష్ లో ఎగ్జామ్ రాసిన వారు టాప్‌లో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల మూల్యాంకనంలో ఇంగ్లీష్ మీడియం వారికి ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వేశారని మండిపడుతున్నారు.
ఉన్నట్లు రాసినా కొన్ని మార్కులే..
ఈ మేరకు చాలా అంశాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మినిమమ్ మార్కులు వేయలేదు. విశ్లేషణాత్మకంగా రాసినవారికి సైతం చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఈ మార్కుల జాబితాను పరిశీలిస్తే 1:2 నిష్పత్తిలో తెలుగు మీడియం అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశం లేదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అభ్యర్థులపై వివక్ష చూపారని, గ్రూప్-1 పేపర్ రీ వాల్యూయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అశోక్‌నగర్‌లోని కొన్ని కోచింగ్ కేంద్రాలకు సీఎంఓకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో బయటపెట్టాలన్నారు. అలాగే 100 మంది ర్యాంకుల వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని టీజీపీఎస్సీని కోరారు.
Also Read: Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
ఇదిలా ఉంటే.. టాప్ 100 ర్యాంకుల్లో సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆర్డీఓ, డీఎస్పీ లాంటి ఉన్నత పోస్టులు వారికే కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఓపెన్ క్యాటగీరిలో ఎంపిక అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగీరీలోనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు అమ్ముకున్నారని, ఒక్కో పోస్టుకు కోట్ల రూపాయలు వసూలు చేసి అసలైన అభ్యర్థులను మోసం చేశారని మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటిపై టీజీపీఎస్సీకి కంప్లైట్ ఇస్తామని, ఆ తర్వాతే ఉద్యోగా నియామకాలు చేపట్టాలని, లేదంటే మరో ఉద్యమం చేస్తామని పలు విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.
Also Read: Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన