/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-15-5.jpg)
TGPSC denies Group-1 exam evaluation allegations
TGPSC: గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలను టీజీపీఎస్సీ కొట్టివేసింది. ఫైనల్ ఎగ్జామ్ మార్కులను కేటాయించడంలో పారదర్శకంగా వ్యవహరించినట్లు ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల పర్సలన్ లాగిన్‌లో పొందుపరిచినట్ల స్పష్టం చేసింది.
In its recent notification, the Commission has voiced concerns over misinformation spreading online about the group one main results. #tspsc #sarkarinaukri https://t.co/ABBVZ3asvR
— IE Education Jobs (@ieeducation_job) March 15, 2025
అభ్యర్థుల్లో గందరగోళం..
ఈ మేరకు కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు మాత్రమే గ్రూప్ -1 పరీక్షల మూల్యంకనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. వ్యక్తిగత స్వార్థం కోసం అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, అత్యధిక, అతితక్కువ మార్కులంటూ సోషల్‌మీడియా ద్వారా అపోహలు సృష్టిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే అభ్యర్థులు, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
అభ్యర్థుల వివరాలు చూడరు..
'గ్రూప్-1 ఎగ్జామ్ మొత్తం 20,161 మంది రాశారు. 12,323 మంది ఇంగ్లీషులో.. 7,829 మంది తెలుగులో, 9 మంది ఉర్దూలో రాశారు. ప్రతి జవాబు పత్రం మొదటి పేజీ OMRలో 3 పార్టులుంటాయి. మొదటి పార్టులో అభ్యర్థి వివరాలు, రెండు, మూడు పార్టుల్లో ఎగ్జామినర్ వేసిన మార్కులుంటాయి. మూల్యాంకనం చేసేముందే అభ్యర్థి వివరాలున్న పార్ట్-1 బార్‌కోడ్ షీట్ తొలగిస్తారు. కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత వివరాలతోపాటు హాల్‌టికెట్ నంబర్ ను మూల్యాంకనం చేసే ఎగ్జామినర్, ఇతరులు చూడలేరు. ప్రతి ఆన్సర్ షీట్ రెండుసార్లు ఇద్దరితో మూల్యాంకనం చేయిస్తాం. మొదటిసారి మూల్యాంకనం చేసి ఎగ్జామినర్ ఇచ్చిన మార్కులను వేరు చేసి రెండోదశ మూల్యాంకానికి పంపిస్తాం' అని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లతో మూల్యంకనం చేపించాం. మూల్యాంకనం చేసిన నిపుణులంతా దేశంలోని వివిధ యూనివర్సిటీలు, విద్యాలయాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ. మూల్యాంకనాన్ని, చీఫ్ ఎగ్జామినర్ కమిటీల నియామకాన్ని అత్యంత గోప్యంగా నిర్వహించాం. ప్రతి సబ్జెక్టుకు ఒక చీఫ్ ఎగ్జామినర్‌తో కమిటీలను నియమించాం. ఈ కమిటీలో ఇద్దరు సబ్జెక్టు నిపుణులుంటారు. చీఫ్ ఎగ్జామినర్లు UPSCకి చెందిన వివిధ పరీక్షల మూల్యాంకనంలో భాగస్వాములుగా ఉన్నారు. అభ్యర్థుల పర్సనల్ లాగిన్‌లో మార్కులను పొందుపరిచేటప్పుడు పారదర్శకత పాటించాం. మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులతో ఫిబ్రవరి 15న డేటా ఖరారు చేశామని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!