TGPSC: Group-1 ఫలితాల్లో మోసం జరిగింది.. GRLపై ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలనం!

తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ బలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టాప్‌ 100 పేపర్లను ఎక్స్‌పర్ట్‌ తో మళ్లీ దిద్దించాలన్నారు.

New Update
group 1 pr

Prasanna Harikrishna Sensational allegations onGroup-1 results

TGPSC: తెలంగాణ గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మూల్యంకణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం, అధికారుల తీరు వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ మండిపడ్డారు. గ్రూప్‌ పరీక్షల్లో అన్ని అవకతవకలే ఉన్నాయని అన్నారు. మార్చి 10న విడుదలైన ఫలితాలు సామాన్య పౌరుడికి చూపించినా తప్పులు గుర్తిస్తాడంటూ సంచలన ఆరోపణలుచేశారు. 

GRL ఇచ్చి పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టండి..

ఈ మేరకు శనివారం గ్రూప్-1 ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించిన హరికృష్ణ.. UPSC తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రూప్‌ 1 నియామకాలపై మరోసారి నిర్లక్ష్యం జరిగిందన్నారు. గ్రూప్‌ 2, 3లో GRLను స్పష్టంగా ప్రకటించిన ప్రభుత్వం గ్రూప్‌-1లో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. GRL ఇచ్చి పబ్లిక్‌ డొమైన్‌లో పెడితే మార్కులెన్ని వచ్చాయో తెలిసేదని, అలా పెట్టకపోవడంతో కుట్ర జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. 

దీని ఆంతర్యమేమిటి..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకువచ్చిన జీవో నం. 55 సోషల్‌ జస్టిస్‌కు ప్రతిరూపం. కానీ ఈ ప్రభుత్వం దానిని తొలగించి జీవో నం. 29 తీసుకొచ్చింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్‌రిలీజ్‌లో GRL ప్రస్తావన రాలేదు. దీని ఆంతర్యమేమిటి. గత నోటిఫికేషన్ ఆధారంగా రూపొందించిన మెయిన్స్‌ పాత ప్రశ్నా పత్రాలనే అక్టోబర్‌ పరీక్షల్లో ఇచ్చారని నిరుద్యోగులు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్‌ ప్రశ్నాపత్రాలను ఎవరితో దిద్దించారో చెప్పాలన్నారు. 

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

ఈ సందర్భంగా మెయిన్స్‌ ఎగ్జామ్‌లో UPSC ప్రమాణాలు పాటిస్తామని మాజీ టీజీపీఎస్సీ చైర్మన్‌, ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ అది పాటించినట్లు ఎక్కడా దాఖలాలు లేవన్నారు. పేపరు దిద్దిన వ్యక్తుల అర్హతలు, బ్యాక్‌గ్రౌండ్‌ బయటపెట్టాలి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో దిద్దిస్తే వారికిచ్చిన బ్లూ ప్రింట్‌లో ఎంత శాస్త్రీయత ఉందో ప్రభుత్వం వివరించాలి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం తయారు చేసిన బ్లూ ప్రింట్‌ గూగుల్‌లో ట్రాన్స్‌లేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే విద్యార్ధులకు ఎలా న్యాయం జరుగుతుంది. మా ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలని అడిగారు. 

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

ఇక ఏపీ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించారనే విషయం తమకు తెలుసు అన్నారు. ప్రశ్నాపత్రాలను హడావుడిగా దిద్దించి, ఫలితాలు విడుదల చేయడం వెనుక అంతర్యమేమిటో చెప్పాలన్నారు. టాప్‌ 100 మందిలో ఎంత మంది ఇంగ్లీషు, తెలుగు, ఉర్ధూ మీడియం విద్యార్ధులు ఉన్నారో చెప్పాలి. ఈ పరీక్షల్లో తెలుగు మీడియం విద్యార్ధులకు అన్యాయం జరిగింది. టాప్‌ 100 ప్రశ్నాపత్రాలను ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేసి మరోసారి దిద్దించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే 20,100 ప్రశ్నాపత్రాలను 3 నెలల సమయం తీసుకొని రీకౌంటింగ్‌ కాకుండా రివాల్యుయేషన్‌ చేయాలని డిమాండ్ చేశారు. 

Advertisment
Advertisment
Advertisment