Dil Raju: వివాదం చేయొద్దు.. గద్దర్ అవార్డులపై దిల్‌రాజు సంచలన కామెంట్స్!

గద్దర్‌ అవార్డులపై నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు అని కోరారు. 

author-image
By srinivas
New Update
IT raids dil raju

Dil raju

Dil Raju: గద్దర్‌ అవార్డులకు సంబంధించి నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని  వైభవంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు అని కోరారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన నిర్మాత.. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందులో భాంగానే గద్దర్‌ అవార్డులను ఇస్తుందన్నారు. ఏప్రిల్‌ లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని గద్దర్‌ అవార్డులకు సంబంధించిన విధి విధానాలు ఖరారైనట్లు తెలిపారు.

రెండు పేర్లతో గౌరవ పురష్కారాలు..

'పైడి జయరాజ్‌, కాంతారావు పేరుతో ఈ గౌరవ పురస్కారాలు అందిస్తాం. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను సైతం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సినిమాలకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు అందిస్తాం. 2014 జూన్‌ నుంచి 2023 డిసెంబర్‌ వరకూ విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇస్తాం. 2024కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులతో పాత అవార్డుల ప్రక్రియను కొనసాగిస్తాం' అని చెప్పారు. 

Also Read :  హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే

ఇక సింహా అవార్డుల కోసం దరఖాస్తుదారులు ఎఫ్‌డీసీకి కొంత డబ్బు పంపించినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఆ డబ్బును వారికి ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తామన్నారు. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని, అప్పుడే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోగలమని సూచించారు. 

Also Read: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు