/rtv/media/media_files/2025/04/08/LkL6ejnWah69fakh2ISj.jpg)
temperature
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల వ్యవధిలోనే నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయని వాతావరణశాఖ సూచించింది. మరోవైపు మంగళ,బుధ వారాల్లో పలు జిల్లాల్లో ఈదురు గాలులు,ఉరుములు,మెరుపులతో కూడిన వర్గాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా..48 గంటల వ్యవధిలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బీహార్ నుంచి ఝార్ఖండ్,ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది.దీని ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.సోమవారం నిజామాబాద్‌లో సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 42.5 డిగ్రీలు,ఆదిలాబాద్ లో 2.1 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 42.3 డిగ్రీలుగా నమోదయ్యింది.
Also Read: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాని చూపిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో అయితే ఉదయం 10 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ప్రజలకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గత రెండు, మూడు రోజులు ఎండల తీవ్రత తక్కువగానే ఉన్నా... ఉదయం 11:25 గంటల సమయానికే 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు దిక్కు నుండి గంటకు 7 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలిలో తేమ 23 శాతంగా ఉండటంతో ఉక్కపోత విపరీతంగా పెరిగింది.
నగరంలో ఎండ తీవ్రతకు అద్దం పట్టే ఘటన హైదరాబాద్ జగద్గిరి గుట్టలో జరిగింది. ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన బైక్ ఎండ వేడికి కాలి బుగ్గుయ్యింది. బైక్‌లో అస్మాత్తుగా మంటలు చెలరేగగా.. క్షణాల వ్యవధిలోనే కూలిబూడిదైంది. దీంతో సమీపంలోని వాహనదారులు, దుకాణదారులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం తగ్గించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అంటున్నారు.
ఎక్కువగా నీరు తాగాలని.., శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని చెబుతున్నారు. లేత రంగు దుస్తులు ధరించాలని.., తలకు టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
weather | Telangana Weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates