Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు.

New Update
Telangana Rising Global Summit 2025 Commenced in Hyderabad

Telangana Rising Global Summit 2025 Commenced in Hyderabad

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్(cm-revanth), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులతో పాటు సినీనటుడు నాగార్జున, పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్‌ సిటీలో మొత్తం 100 ఎకరాల విస్తీర్ణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8,9 రెండ్రోజుల పాటు ఈ సదస్సు కొనసాగుతోంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Also Read:  గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

Telangana Rising Global Summit 2025

ఈ సమ్మిట్‌కు ముందు సీఎం రేవంత్‌ అక్కడికి చేరుకున్నారు. స్టాళ్లను పరిశీలించారు. అధికారులకు ఆయన పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం.. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు రానున్నాయి. దీంతో అత్యాధునిక హంగులతో అనేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం ఇచ్చే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలతో పాటు భారత్‌ ఫ్యూచర్‌ సిటీపై సీఎం ఈ సదస్సులో వివరించనున్నారు. 

Also Read: కేరళలో కొత్త రోగం.. 42 మంది మృతి.. డేంజర్లో 170 మంది.. ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు