Crime News: అమెరికాలో కాల్పుల కలకలం.. తెలంగాణ విద్యార్థి మృతి!

అమెరికాలోని మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశం పేటకు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవీణ్ స్పాట్‌లోనే తుదిస్వాస విడిచాడు.

New Update
Telangana Rangareddy Keshampet resident Praveen dead in US

Telangana Rangareddy Keshampet resident Praveen dead in US

Crime News: అమెరికా(America)లో దారుణం జరిగింది. కొందరు దుండగులు తెలంగాణ విద్యార్థి ప్రవీణ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రవీణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. అందులో ఒక కొడుకు ప్రవీణ్(27)‌, కూతురు ఉన్నారు. వీరిలో కొడుకు ప్రవీణ్ కొన్నేళ్ల కిందట ఉన్నత చదువులు చదవాలని అమెరికా వెళ్లాడు. మిల్వాకీ కౌంటీ విస్కాన్సిన్‌ రాష్ట్రం మిల్వాకీ నగరంలో నివాసం ఉంటున్నాడు. 

Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

ఎంఎస్ సెకండ్ ఇయర్

అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక అక్కడి ఖర్చుల కోసం పార్ట్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఓ స్టార్ హోటల్‌లో పార్ట్ టైంకి జాయిన్ అయ్యాడు. ఇక ప్రవీణ్ నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో ఒక బీచ్ ఉంది. అక్కడే కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Also Read :  మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

స్పాట్‌లో మృతి

అనంతరం ఆ గాయాలతో స్పాట్‌లోనే ప్రవీణ్ మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.

Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

New Update
mla-rajasingh cases

mla-rajasingh cases

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  శోభాయాత్రలో రాజాసింగ్‌ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో  భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్‌ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.  

ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.  ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్‌ కీలక కామెంట్స్ చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్‌ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని  9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment