/rtv/media/media_files/2024/11/08/c9bp3UXN2dnHHTmtV1CZ.jpg)
Telangana poor students 25 percent free seats in private schools
తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లలో (Private Schools) చదివించాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25 శాతం సీట్లను కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తుండగా అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఇటీవల హైకోర్టుకు సమర్పించింది.
Also Read : ఈ కుక్కర్లోనే ఉడికించి.. ఫినాయిల్ తో కడిగి: వెలుగులోకి భయంకర నిజాలు!
తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు..
ఈ మేరకు దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టంలోని సెక్షన్12 (1)సీ ప్రకారం ప్రీ ప్రైమరీ, 1వ తరగతిలో 25 శాతం సీట్లు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా ఇది అమలవుతుండగా.. తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయట్లేదు. దీంతో చట్టం అమల్లోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా ఈ 6 రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఉన్నత న్యాయస్థానాలు వెంటనే ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చాయి.
ఈ క్రమంలోనే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సిద్ధమవుతోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే ఇందుకు సంబంధించి అంశంపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 11,500 ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయింనుంది. ఈ విధివిదానాలపై విద్యాహక్కు చట్టం అమలు కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు బడుల్లో 25 శాతం ఫ్రీ సీట్ల విధానం అమలు చేస్తే సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్ తగ్గే ప్రమాదం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. సర్కారుపై కూడా భారీ భారం పడుతుందంటున్నారు. ఏడాదికి సుమారు 10 వేల నుంచి 15 వేల మందికే ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తోంది.
దీంతో ఫీజులు ఎలా నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజు, ఒక విద్యార్థిపై ఖర్చు చేసే యావరేజీ ఏది తక్కువగా ఉంటే అదే అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోలో పేర్కొన్నారు. దీంతో ఇదే జీవోను అమలు చేయలా? ఏమైనా మార్పులు చేయాలా అనే దానిపై ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు బడుల్లో ఏటా దాదాపు 4 లక్షల మంది 1వ తరగతిలో చేరుతున్నారు. వీరికి 25 శాతం అంటే సుమారు లక్ష మందికి ఉచిత విద్య అందనుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అన్ని రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు సమాచారం.
Also Read : లోకేష్ బర్త్ డే గొడవ.. బ్యానర్లు చించి తన్నుకున్న తమ్ముళ్లు!