/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
Telangana local elections in June
Sarpanch Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్థం ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆలస్యం అయిందని, జూన్ లో ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..
ఈ మేరకు ఇప్పటికే ఆలస్యం అవుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఏప్రిల్1 నుంచి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసన సభ, మండలిలో ఇప్పటికే ఆమోదించుకుంది. కాగా వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. అన్నీ పార్టీలు, బీసీ, ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదికగా రాబోయే 45 రోజులు పోరాటం చేయాలని యోచిస్తోంది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
అమలుకోసం కోర్టుకు..
బీసీ రిజర్వేషన్ పై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే ముందుకెళ్లడమే. లేదంటే అమలుకోసం కోర్టుకు వెళ్లాలని చూస్తున్నారు. అదికూడా కుదరకుంటే పార్టీ పరంగా బీసీలకు 42 శాతానికి పైగా సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా ఆమోదం పొందగా ఈ రెండు బిల్లులు రాజ్ భవన్ కు చేరినట్లు సమాచారం.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఇక రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన కేంద్రం పరిధిలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వంతోనే అమీతుమీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందుకోసం తమిళనాడు, ఇతర రాష్ట్రాల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలిసివచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించి షెడ్యూల్ 9లో చేర్చాలని కోరనున్నట్లు సమాచారం.
ఇక ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మొత్తం రూ.1,500 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పాలక వర్గాలు కొలువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కాంగ్రెస్ నేతల నుంచి ఎన్నికల కోసం ఒత్తిడి పెరుగుతుంది. గ్రామ కేడర్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలాంటి పదవులకోసం ఎదురుచూస్తోంది. గ్రామాల్లో పార్టీకి పట్టు చిక్కితే మరింత బలం చేకూరుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
Also Read: Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!
చివరగా కేంద్రం బీసీ రిజర్వేష్ల పెంపుపై స్పందిచకపోతే 2 రకాల ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఒకటి నేరుగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి ఎన్నికలకు వెళ్లడం. దీనిపై అభ్యంతరాలొస్తే కోర్టుకు వెళ్లి లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కోర్టుల నుంచి ఏదైనా స్టే వచ్చినా, రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా, సుప్రీం కోర్టులో కొట్లాడేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. మొత్తగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బలంగా అనుకుంటున్నట్లు సమాచారం.
telangana | local-body-elections | cm revanth | telugu-news | today telugu news | rtv telugu news