Telangana Cabinet: కేబినెట్ మీటింగ్.. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం..

తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

New Update
Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో భేటీ అయిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం వేసింది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలను సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు, బీసీ రిజర్వేషన్లతో సహా మరికొన్ని అంశాలపై చర్చించారు. మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ!

మెట్రో రైల్‌ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనతో సహా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్‌ బోర్డు, HMDA యాక్ట్‌లో మార్పులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూభారతి చట్టం అమలు, మైనింగ్ యాక్ట్, ఎల్‌ఆర్‌ఎస్‌ అంశాలు కేబినెట్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో కేబినెట్‌ నిర్ణయాలను మంత్రులు వెల్లడించనున్నారు.    

Also Read: కోమాలోకి వెళ్లాడంటూ డాక్టర్లు డబ్బు డ్రామా.. ICU నుంచి నడుచుకుంటూ బయటకొచ్చిన పేషెంట్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Varshini - Aghori: ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!

వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

New Update
Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets.

Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets

అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్షుద్రపూజలు చేసి.. వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అంటున్నారు. ఇటీవలే గుజరాత్‌లో అఘోరీతో ఉన్న వర్షిణీని ఆమె అన్నయ్యలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్షిణీ ఫ్యామిలీని RTV ఛానెల్ సంప్రదించగా.. వారు అఘోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీకి డబ్బులు

ముఖ్యంగా అఘోరీకి డబ్బులు ఎలా వస్తున్నాయి?.. ఎంత వస్తున్నాయి?.. ఆమెకు ఆస్తులు ఉన్నాయా? లేదా? అనే దాని గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది అఘోరీ తమకు చెప్పిందని వారు అన్నారు. ఈ మేరకు వర్షిణీ పేరెంట్స్ మాట్లాడుతూ.. తాను స్మశానంలో పూజలు చేస్తానని.. మినిమం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వనిదే తాను డీల్ కుదుర్చుకోనని అఘోరీ చెప్పిందని అన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రభాస్ ఇంటి పక్కన విల్లా

ఆ పూజలు కేవలం బడా బడా వ్యక్తులకే చేస్తానని.. చిన్న చిన్న వారికి చేయనని అఘోరీ చెప్పినట్లు వారు తెలిపారు. అలాగే యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా తనకు హైదరాబాద్‌లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉందని కూడా ఆమె చెప్పిందని.. దాని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని కూడా అఘోరీ వారితో చెప్పినట్లు వర్షిణీ పేరెంట్స్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(lady aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment