/rtv/media/media_files/2025/04/03/MwIbURQcKxdhS1muN6nL.jpg)
teacher-posts
తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనర్హత పిటిషన్ ల పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, కౌశిక్‌రెడ్డి తరఫున ఆర్యామ సుందరం తమ వాదనలు వినిపించారు.
Also Read : ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!
Also Read : ఆ అందగత్తెతో డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్
సుదీర్ఘంగా వాదనలు
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే రీజనబుల్ టైం అంటే 2028 వరకు వేచి చూడాలా అని అభిషేక్ మను సింఘ్విను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావంటూ ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ లాయర్ ఆర్యమా సుందరం. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని అత్యున్నత న్యాయస్థానం వాటిని పక్కన పెట్టింది.
ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ ఆర్యమా సుందరం. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
డిల్లీ
— Telangana Awaaz (@telanganaawaaz) April 3, 2025
సుప్రీంకోర్టులో ముగిసిన పార్టీ పిరాయింపుల కేసు విచారణ..
పిరాయింపుల కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. https://t.co/NykJ7DVYA1
Also read : అంత రెమ్యూనరేషన్‌కే ఇంత రెచ్చిపోవాలా.. బిగ్ బాస్ బ్యూటీని ఊతికారేస్తున్న నెటిజన్లు!
Also read : Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా!
supreme-court | congress | brs-party | latest telangana news | telangana news today | telangana-news-updates | today-news-in-telugu | latest-telugu-news