ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన జైలులో ఉన్నారు. ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడంతో ఇకపై తిరుపతన్న జైల్లో ఉంటాల్సిన అవసరం లేదని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

New Update
phone taping case

phone taping case Photograph: (phone taping case)

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న 10 నెలలుగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణకు జైలులో ఉన్నారు. ఈ కేసులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడంతో ఇకపై తిరుపతన్న జైల్లో ఉంటాల్సిన అవసరం లేదని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈమేరకు తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది.

Also Read: ఒకే నెలలో 1000 తాబేళ్లు మృ‌తి.. చెన్నై తీరంలో ఏం జరుగుతుంది?

కొంతమంది కీలక సాక్ష్యులను ఇంకా విచారించాల్సి ఉందని ఈక్రమంలో బెయిల్ మంజూరు చేయద్దని ఆయన వాదించారు. ఇంకా ఈ కేసు విచారణకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలంగాణ రాష్ట్రం తరుపు న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు.  రాజకీయ నాయకుల ఆదేశాలతో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఆయన ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ట్రయల్‌కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయోద్దని షరతులతో సుప్రీం కోర్టు తిరుపతన్నకు బెయిల్ ఇచ్చింది.

Also Read: ఈ ఏడాది ఫిబ్రవరి చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR  : దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ…

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు

New Update
 Ktr Write A Letter On Kancha Gachibowli Forest

Ktr Write A Letter On Kancha Gachibowli Forest

KTR  : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అడవిని కాపాడేందుకు నిస్వార్థంగా, ఉదాత్తమైన లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని, పర్యావరణం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.అందరం కలిసి చేసి ఈ ఉద్యమంలో 400 ఎకరాల పచ్చదనాన్ని, 734 జాతుల పుష్పించే మొక్కలు, 220 జాతుల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలకు జీవనాధారం అయిన ప్రకృతిని కాపాడమని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!


ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను, మన సమిష్టి భవిష్యత్తు పట్ల మనకున్న ఆందోళనను పంచుకునే తోటి పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని రక్షించడానికి తమ స్వరాన్ని పెంచిన ప్రతి విద్యార్థి, పర్యావరణవేత్త, జర్నలిస్ట్, ప్రజా వ్యక్తి, పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వం విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తున్నా, నిస్వార్థమైన విద్యార్థి-ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులు చేసిన పోరాటానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం దీనికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ దళారి మాదిరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసం, బెదిరింపు ధోరణిలో ఏకో పార్క్ ఏర్పాటు అంటూ, ఫోర్త్‌ సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ తరలింపు అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడి వరకూ పక్కా కుట్రతో మాట్లాడుతున్న మాటలను కేటీఆర్ తన లేఖలో ఎండగట్టారు. 50 సంవత్సరాలకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ ప్రాపగండ చేస్తున్న ఏకో పార్క్ కన్నా గొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిన క్యాంపస్‌గా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. విద్యార్థుల పోరాటం ఫలించి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన పర్యావరణ హత్యను అడ్డుకున్నదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల నేపథ్యంలో ఈ పోరాటం పూర్తిగా అయిపోలేదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలి ఉందని, ప్రభుత్వ కుట్రలను, బెదిరింపులను, దుష్ప్రచారాన్ని దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలియజేశారు. ఈ పోరాటానికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.  

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇప్పటికే మా పార్టీ తరఫున 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ తెలియజేశారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా బి ఆర్ ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణం కోసం 400 ఎకరాలను వేలం వేసే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకుంటున్నట్లు వెంటనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

Advertisment
Advertisment
Advertisment