SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!

SLBC ప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్‌కు చేరుకున్న జియాలజిస్టులు బురద నీరు పెరుగుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్టు ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ 8 మంది కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

New Update
cm revanath slbc

SLBC UPDATES:  శ్రీశైలం SLBCలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా కార్మికుల జాడ కనిపించకపోవడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సోమవారం ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఫోన్లు రింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫోన్లు పనిచేస్తున్నా వారు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు కార్మికుల ఆచూకీ లభించకపోవడంపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మట్టి నీటిని ల్యాబుకు తరలించి..

ఈ మేరకు టన్నెల్ నుంచి 8మంది కార్మికులును సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీం శ్రమిస్తోంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్‌కు చేరుకున్న జియాలజిస్టులు కన్వేయర్ బెల్టు కూడా ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రమాద ప్రాంతంలో మట్టి నీటిని ల్యాబుకు తరలించిన జియాలజిస్టులు రిపోర్ట్ రాగానే ప్రమాదం గురించి అంచనా వేయొచ్చని చెబుతున్నారు. ఇక మట్టి కూలడంతో టన్నెల్ బోరింగ్ మెషిన్ దెబ్బతిన్నట్ల తెలిపారు. టన్నెల్‌లో క్రమక్రమంగా బురద నీరు పెరుగుతుందని, దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు. 

కాంటాక్ట్ అవ్వడానికి NDRF  ప్రయత్నాలు..

ఇక బురద నీటిని బయటకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సొరంగంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ సమీక్షిస్తున్నారు. మూడు రోజులుగా మంత్రులు జూపల్లి, ఉత్తమ్ ఘటనా స్థలంలోనే ఉంటూ అధికారులతో చర్యలు చేపడుతున్నారు. కార్మికులతో కాంటాక్ట్ అవ్వడానికి NDRF  ప్రయత్నిస్తోంది. 200 మీటర్ల వరకు మట్టి కూరుకుపోవడంతో ఆచూకి కష్టంగా మారిందని డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. 1శాతం మాత్రమే ఆ 8మంది బతికే ఛాన్స్ ఉందంటున్నారు. 

ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్‌!

ఈ టన్నెల్‌ లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకోగా వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వారి ప్రాణాలు కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, హైడ్రా రెస్క్యూ టీమ్స్ సైతం ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్‌ మైనర్స్ ను రప్పించి పరీశీలించగా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌లో400 మీటర్ల వరకు మట్టి, ఐరన్‌ షీట్లు కూరుకుపోయినట్లు గుర్తించారు. టన్నెల్‌లో 2.5 మీటర్ల ఎత్తున బురద పేరుకుందని, సొరంగంలో భారీగా ఊటనీరు ఉబికివస్తున్నట్లు తెలిపారు. నిమిషానికి 3500 లీటర్ల ఊటగా వస్తుందని, దీంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు