Hyderabad: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. మూడు కార్పొరేషన్‌లకు ప్రత్యేక చట్టం

సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు వర్తించేలా ఇప్పుడున్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

New Update
special law for three corporations in Hyderabad

special law for three corporations in Hyderabad

సీఎం రేవంత్(cm revanth) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న మూడు కార్పొరేషన్లకు వర్తించేలా ఇప్పుడున్న జీహెచ్‌ఎంసీ(ghmc) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు, పన్నులు, పర్మిషన్లు, ఇతర కార్యకలాపాలకు ఈ చట్టమే ఆధారం కావాలని పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన పురపాలక పట్టాణాభివృద్ధిశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

Also Read: కవితకు దిమ్మతిరిగే షాకిచ్చిన సీబీఐ!

Special Law For Three Corporations In Hyderabad

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్‌ అర్బన్ రీజియన్ ఎకానమి (క్యూర్) ప్రాంతంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. శానిటేషన్, దోమల నివారణకు స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. చెత్త ఎక్కడ పడేయాలో ముందుగానే గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యూర్ ప్రాంతంలోని రోడ్ల నిర్మాణం వ్యవహారంలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. అలాగే స్ట్రీట్‌ లైట్లకు కూడా ప్రత్యేక నెంబర్ ఇచ్చి డ్యాష్‌బోర్డుకు లింక్ చేయాలన్నారు. ఆహార నాణ్యతకు కూడా ప్రాధాన్యమివ్వాలని, హోటళ్లలోని వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్‌కు లింక్ చేయాలని చెప్పారు.  

Also Read: తెలంగాణలో ఎంసెట్ రద్దు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

నగరంలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని తెలిపారు. క్యూర్‌ పరిధిలోని ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల రోడ్లను పురపాలక పట్టణాభివృద్ధిశాఖ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఫ్యూచర్ సిటి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. హైడ్రా పరిరక్షించిన చెరువులను రక్షించడంతో పాటు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు వీటిని పర్యాటక ప్రదేశాలుగా, జల వనరులుగా మార్చాలని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు