/rtv/media/media_files/2026/02/21/sunitha-2026-02-21-16-43-46.jpg)
Software Sunitha case..husband didn't take the dead body.
SUNITHA CASE : వనస్థలిపురం(vanasthalipuram) లో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సునీత(vanasthalipuram sunita incident) విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హంతకుడు మహేష్, సునీతలకు పెద్దపల్లి జిల్లా మంథనిలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. సుమారు ఎనిమిదేళ్ల ఇద్దరి మధ్య ప్రేమవ్యవహారం నడిచింది. బీటెక్ చదివిన మహేశ్ 2019లో ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కెనడాలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే సునీతకు వీసా రాకపోవడంతో ఆమెను ఇంటివద్దే ఉంచి తానొక్కడే కెనడా వెళ్లాడు. అయితే మహేష్ కెనడా వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో తరుచూ గొడవలు జరిగేవి. అయినా ఆ తర్వాత ఆమెకు వీసా రావడంతో కెనడా తీసుకెళ్లినప్పటికీ అక్కడిక వెళ్లిన పదిహేను రోజులకే ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో భర్త వేధిస్తున్నాడంటూ కెనడా పోలీసుల సాయంతో సునీత ఇండియాలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. వచ్చిన తర్వాత కెనడాలో ఉన్న భర్తపైన, మంథనిలో ఉంటున్న అత్తామామలపైన మహారాష్ర్టలోని బల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో గృహహింస కేసు, విడాకుల కేసు పెట్టింది. కోర్టు విడాకులు మంజూరు చేయకముందే పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు.
ఇదిలా ఉండగానే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్(software) ఉద్యోగం లో చేరిన సునీతకు 2024లో బేగంపేటలో శ్రీనాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. 2025 ఏప్రిల్‌లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు మహేష్‌తో పెళ్లైన విషయం శ్రీనాథ్‌కు చెప్పలేదు. ఇప్పుడు సునీత నాలుగు నెలల గర్భ వతి.
మరోవైపు సునీత పెట్టిన కేసుల వల్ల మహేష్, అతని తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అవమాన భారంతో మహేష్ తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి మరణంతో ఇండియాకు వచ్చిన మహేష్ తిరిగి కెనడాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె పెట్టిన కేసుల వల్ల మహేష్‌కు వీసా రాలేదు. దీంతో ఆవేశంతో రగిలిపోయి సునీత ఉంటున్న అడ్రస్‌కు వచ్చి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Also Read : మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు.. ఎన్నిరోజులో తెలుసా?
మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరణ
తను సునీతను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, అప్పటికే ఆమెకు మహేష్‌తో పెళ్లైన విషయం నాకు తెలియదు అని వాపోయాడు. సునీత ప్రస్తుతం నాలుగు నెలల గర్భ వతి. మరో 5 నెలల్లో మాకు పాపో, బాబో పుట్టబోతున్నారని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంతలోనే ఈ దారుణం జరిగింది.’ అని శ్రీనాథ్ కంటతడి పెట్టాడు. అయితే మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని శ్రీనాథ్ వాపోయాడు. దీంతో సునీత మృతదేహన్ని తీసుకెళ్లేందుకు శ్రీనాథ్ నిరాకరించినట్లు తెలిసింది.
Also Read : సిద్దిపేట జిల్లాలో దారుణం.. కాంగ్రెస్ నేత మర్డర్
Follow Us