/rtv/media/media_files/2025/02/26/DHBxIDJLmUhAmelqEnqg.jpg)
slbc Photograph: (slbc)
SLBC: SLBC టన్నెల్ ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఇంకా ఆ 8 మంది ఆచూకీ లంభించలేదు. రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్న NDRF, NGRF, L&T, ఫైర్, సింగరేణి, హైడ్రా, ఇండియన్ ఆర్మీ , ఇంజనీరింగ్ విభాగం, నేవి, మార్కోస్ కమెండోలతో పాటు టన్నెల్ ఎక్స్‌పర్ట్స్, క్రిస్కూపర్, రాబిన్స్ కంపెనీ, నవయుగ, మెగా కంపెనీల టీంలు సైతం వారిపై ఆశలున్నట్లు చెప్పట్లేదు. అంతేకాదు ఈ ఆపరేషన్ చాలా డేంజర్ గా మారిందని, లోపల పేరుకుపోయిన మట్టిదిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరింస్తున్నారు. దీంతో రెస్య్కూ ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంటుండగా ఆ 8మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/26/KFcIabHOKr0n5DMJzht4.jpeg)
Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
15 మీటర్ల వరకు చేరుకున్న బృందాలు..
ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు చేరుకున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. అయితే బురద, మట్టి పెల్లలతో లోపల భయానక పరిస్థితులున్నట్లు చెబుతున్నాయి. ఘటనా స్థలానికి దరిదాపుల్లోకి వెళ్లినప్పటికీ ఆక్సిజన్ అందకపోవడంతో మళ్లీ వెనక్కి వచ్చేశారు. అయితే బుధవారం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఊట పెరుగుతున్న కారణంగా సీపేజ్, కూలుతున్న మట్టి పెల్లలతో టన్నెల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేస్తుండగా.. టన్నెల్లోంచి గంటకు 5వేల లీటర్ల ఊటనీరు ఉబికివస్తోంది. 100 HP కెపాసిటీ ఉన్న భారీ పంపును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, శిథిలాలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నట్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సిబ్బంది తెలిపారు.
/rtv/media/media_files/2025/02/26/8szteRtPL4MmvgPSBTWU.jpeg)
సహాయక చర్యల్లో 584 మంది..
జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేకంగా పిలిపించిన ర్యాట్ హోల్ మైనర్స్ కూడా చేతులెత్తేశారు. బురద, నీటి ప్రవాహంలో పనిచేసిన అనుభవం తమకు లేదని తేల్చి చెప్పారు. టన్నెల్ లోపల పరిస్థితులు ఊహించినదానికంటే తీవ్రంగా ఉన్నాయన్నారు. స్నీపర్ డాగ్ సైతం బురద నీటి కారణంగా ఎలాంటి వానసను పసిగట్టి లేకపోయింది. అయితే బుధవారం కన్వేయర్ బెల్టును అందుబాటులోకి తీసుకొస్తే గంటకు 800 క్యూబిక్ మీటర్ల బురదను క్లియర్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రొక్లెయిన్ వెళ్లేందుకు అనువుగా ఐరన్ వ్యర్థాలను తొలగించి కన్వేయర్ బెల్టుతో బురదను బయటకు పంపించాలని చూస్తున్నారు. ప్రస్తుతం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటుడగా బుధవారం జీఎస్ఐ, ఎన్‌జీఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్ నుంచి మరికొంతమంది పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే
3 భాగాలుగా సొరంగం..
ఇక 13.85 కి.మీ. సొరంగాన్ని 3 భాగాలు A, B, C లుగా విభజించారు. మొదటి నుంచి 12 కి.మీ. వరకు A భాగం. 10.7 కి.మీ. వరకు నీళ్లు లేకపోవడంతో ఇక్కడికి లోకో రైలు వెళ్లే పరిస్థితి ఉంది. ఆ తర్వాత 11.30 కి.మీ. వరకు 1.5 అడుగుల నీళ్లున్నాయి. B భాగం 1.50 కి.మీ. పొడవు. లోకో రైలు పట్టాలపై 2.5 అడుగుల నీళ్లున్నాయి. భారీ పరికరాలను తీసుకెళ్లే పరిస్థితి లేదు. C భాగం 310 మీటర్లు. ఈ ప్రాతంలో బురద, నిర్మాణ వ్యర్థాలు, సామగ్రితోపాటు 100 మీటర్ల మేర టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిపోయి ఉంది. ఇక్కడి వరకు రక్షకదళ సభ్యులు చేరుకోగలిగినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/media_files/2025/02/26/DA3VHZbm5P42qRiB8EYf.jpeg)
Also Read : మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే
ప్రభుత్వం ఏ సాయం చేస్తుందో చెప్పాలి..
ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8మంది కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి కన్నీరుమున్నీరవుతూ వచ్చారు. వీరందరినీ ఓదార్చి, ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది. ఇందులో ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ భార్య, ఇద్దరు కూతుళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుటుంబాన్ని వదులుకుని ఇంత దూరం వస్తే ఇలా జరిగిందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. నాలుగు రోజులవుతున్నా తమ బిడ్డలు బతికున్నారో లేదో చెప్పడం లేదని, తమకు ప్రభుత్వం ఏ సాయం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ 8 మంది వీరే..
జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్. రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. రాబిన్ సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గురుదీప్ సింగ్ సొరంగం లోపల చిక్కుకుపోయారు.
/rtv/media/media_files/2025/02/26/UK9rqo8mbgmajA26tT3E.jpeg)
Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సర్వశక్తులు ఒడ్డుతున్నాం.. ఉత్తమ్
ఇక చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నామన్నారు. బుధవారం ఎన్‌జీఆర్‌ఐ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి మరికొంతమంది నిపుణులు రానున్నారని తెలిపారు.