SLBC UPDATE: SLBC రెస్య్కూ ఆపరేషన్ మరింత కష్టంగా మారింది. గల్లంతైన 8 మంది కార్మికుల మృతదేహాల కోసం 15 రోజులుగా గాలింపు కొనసాగుతుండగా టన్నెల్ నుంచి కుళ్లిపోయిన వాసన వస్తున్నట్లు తెలుస్తోంది. టన్నెల్‌లో సీ ఫేజ్ వాటర్ ఉబికి వస్తోందని, మృతదేహాలను బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
7 అడుగుల మేర తవ్వకాలు..
ఈ మేరకు GPR చూపించిన ప్రాంతంలో 7 అడుగుల మేర రెస్క్యూ టీమ్ తవ్వకాలు చేపట్టింది. ఆ 8మంది డెడ్ బాడీలను కనుగొనేందుకు టన్నెల్‌లోనే NDRF, SDRF, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెండో రోజు టన్నెల్‌లోకి వెళ్లిన క్యాడవర్ డాగ్స్ ఇంతవరకు ఎలాంటి వాసన పసిగట్టలేదని, రెస్క్యూ ఆరేషన్ మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం దాదాపు 5 వందలకు పైగా 4 షిఫ్టుల్లో ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు..
టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. అక్కడ ఒకవేళ తవ్వకాలు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందన్నారు. అందుకే రోబోల సహాయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?
దేశంలోనే సొరంగాల్లో ఈ తరహా క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని అన్నారు. అందుకే నిపుణుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 13 వేల950 కిలోమీటర్ల వరకూ సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరంగా మారిందని, అందుకే అక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు రేపటి నుంచి రోబోల సహాయం తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు. మంత్రితో పాటు కలెక్టర్ బాధావత్, సంతోష్ ఎస్పీ రఘునాథ్ , ఇతర రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!