/rtv/media/media_files/2025/03/01/BTqyCXFQ6EKXAvUF7vSN.jpg)
SLBC
SLBC: SLBC టన్నెల్ ఘటన విషాదంగా మారినట్లు తెలుస్తోంది. టన్నెల్‌లో చిక్కుకున్న ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. NRPS, NGRI, GSI బృందాలు GPR సాయంతో 5గురి ఆనవాళ్లను బురదలోపల గుర్తించగా శనివారం మిగతా ముగ్గురిని కూడా గుర్తించనున్నట్లు సమాచారం.
బురద లోపల ఆనవాళ్లు..
13.85 కిలోమీటర్ల సొరంగంలో సహాయక బృందాలు శుక్రవారం 13.61 కిలోమీటర్లను దాటుకుని ముందుకెళ్లాయి. 9.2 మీటర్ల వెడల్పుతో ఉన్న టన్నెల్‌లో 5 1/2 అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు తెలిపారు. ఆ 8 మంది బురదలోనే కూరుకుపోయినట్లు అనవాళ్లు చెబుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. TBM భాగాలను కట్టర్లతో కట్ చేసి, అక్కడున్న సామగ్రిని మొత్తం బటయకు పంపిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు మిషన్ కటింగ్ దాదాపుగా పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మొత్తం ఆ ప్రాంతాన్ని క్లీ్న్ చేయాలంటే మరికొన్ని రోజులు సమయం పడుతుందంటున్నారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
'టన్నెల్ ఘటన స్థలంలో GPR సాయంతో ఎన్‌జీఆర్‌ఐ నిపుణులు స్కానింగ్ చేశారు. రేడియో తరంగాల ద్వారా భూగర్భంలోని వస్తువులు, అవశేషాలు, ఇతర పదార్థాలను గుర్తించింది. టీబీఎం, ఇతర పరిసరాల్లో కొన్ని అనుమానిత ప్రాంతాలను గుర్తించాం. ఆయా చోట్ల తవ్వకాలు చేపడుతున్నాం. ఆక్వాఐ పరికరంతోనూ స్కానింగ్ చేస్తున్నాం. శనివారం ఈ ప్రక్రియ దాదాపు పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం' అని అధికారులు తెలిపారు.
Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్