/rtv/media/media_files/2025/03/03/N8ckedMk8pjXDVf80RuP.jpg)
revanth reddy SLBC tennel Photograph: (revanth reddy SLBC tennel)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. SLBC ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి అన్నీ అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయంలో SLBC టన్నల్ పనులు జరగలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. లేదంటే ముఖ్యమంత్రిగా నువ్వు రాజీనామా చేస్తావా అని హరీశ్ రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 కిలో మీటర్ల మేరా సొరంగం తవ్వామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమని ఆయన అన్నారు.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
Also read:MLC elections Counting: 6 ఎమ్మెల్సీ స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం
SLBC టన్నల్ ప్రమాదంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ లీడర్ ఆరోపించారు. ఆదివారం SLBC టన్నల్ సహాయక చర్యలు సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమాదానికి బీఆర్ఎస్‌యే కారణమని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు హరీశ్ రావు సోమవారం కౌంటర్ ఇచ్చారు. 10 రోజులైతున్నా చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనిపెట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. మీ వల్ల కాకుంటే చెప్పండి.. నేను స్వయంగా రెస్య్కూ ఆపరేషన్ చేయిస్తానని హరీశ్ రావు అన్నారు.