/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
Revanth Reddy
తెలంగాణలోని ప్రముఖ నగరాలైన ఖమ్మం(khammam), వరంగల్, కరీంనగర్(karimnagar) కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ORR(outer-ring-road)) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురపాలక శాఖను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో రాబోయే విమానాశ్రయాలను (వరంగల్ వంటివి) దృష్టిలో పెట్టుకుని, కనెక్టివిటీ దెబ్బతినకుండా రహదారుల నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా ఈ రోడ్ల ఆకృతులు (డిజైన్లు) ఉండాలని, పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.
అదే సమయంలో గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని రక్షించడానికి రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వ అవసరాల కోసం అద్దెకు తీసుకునే వాహనాలతో సహా అన్ని చోట్లా ఎలక్ట్రిక్ (EV) వాహనాలనే ప్రవేశపెట్టాలి. ప్రతి మున్సిపాలిటీలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. పట్టణాలు, నగరాల్లో మొబైల్, ఇతర రేడియేషన్ ప్రభావాలను తగ్గించడానికి ఆధునిక 'మల్టీ యుటిలిటీ టవర్లను' ఏర్పాటు చేయాలి.
Also Read : తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి
Outer Ring Roads For Three Cities
ఆధునిక అర్బన్ ప్లానింగ్, మురుగునీటి శుద్ధి పట్టణీకరణ ప్రణాళికలు (Urban Centric Development) పక్కాగా ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.అర్బన్ ప్రణాళికలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా శుద్ధి చేసిన మురుగు నీటిని (Recycled Water) భవన నిర్మాణాల్లో వాడేలా నిబంధనలు తీసుకురావాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రతి పట్టణంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని, ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి(cm-revanthreddy) నిర్ణయించారు.నల్గొండ - యాదగిరిగుట్ట ప్రాంతాల మధ్య 'టెంపుల్ కారిడార్' అభివృద్ధి చేయాలి.ఉత్తర తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్, నాగోబా, బాసర, మరియు కడెం ప్రాజెక్టులను కలుపుతూ ఒక భారీ 'టూరిజం కారిడార్‌ను' నిర్మించాలి. రాబోయే కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
సింగరేణి బొగ్గు గనుల పరిధిలో ఉన్న అన్ని పురపాలికలను ఒకే యూనిట్‌గా పరిగణించి సమగ్ర అభివృద్ధి చేపట్టాలని సీఎం సూచించారు. సింగరేణి సంస్థకు వచ్చే సీఎస్‌ఆర్ (CSR - Corporate Social Responsibility) నిధులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా, స్థానికంగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు, వరంగల్(warangal) ఎయిర్‌పోర్టుకు కావలసిన నీటి అవసరాలను ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ (Defence) ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతోందని సీఎం వెల్లడించారు. భవిష్యత్ తెలంగాణకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ అత్యంత కీలకమని, ఎయిర్‌పోర్టుల రాకతో ఈ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : హైదరాబాద్‌లో తీవ్ర కలకలం: 'బండి భగీరథ్ పరారీ' అంటూ పోస్టర్లు..
Follow Us