/rtv/media/media_files/2025/01/02/IOzNn2TcGkMXqkRbYRIw.jpg)
Kumbh Mela and Train
సికింద్రాబాద్ నుంచి కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నంబరు రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. ఇది బుధవారం ఉదయం 9.25 గంటలకు బయల్దేరాల్సి ఉండగా..మంగళవారం రాత్రి 7.35 గంటలకు అంటే సుమారు 14 గంటల ముందు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు రావాల్సిన 12792 నంబర్ రైలునూ ఆపరేషనల్ కారణంతో రద్దు చేస్తున్నట్లు తెలిపింది.దాదాపు 1500 మంది ప్రయాణికులు నెల, రెండు నెలల ముందే కుంభమేళాకు ఈ రైల్లో వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
బయల్దేరేది తెల్లారే కావడంతో ప్రయాణానికి సిద్ధం అయ్యారు. ఇంతలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మొబైల్ లో సమాచారం పంపింది. దీంతో కుంభమేళాకు ఎలా వెళ్లేది అంటూ ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ శాఖ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
రైలు ఒకే ఒకటి...
ప్రయాగ్ రాజ్ (Prayagraj) కు వెళ్లేందుకు రాష్ట్రం నుంచి బయల్దేరే రైలు ఒకే ఒకటి ఉంది. సాధారణ రోజుల్లోనే అధిక డిమాండ్ ఉంటుంది. కుంభమేళాకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉండటంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రానూపోనూ రూ. 50 వేలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా మంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు.
రైలు రద్దు నిర్ణయం పై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఉన్నది ఒకటే రెగ్యులర్ రైలని, కొనసాగించాలని రైల్వే బోర్డును కోరినట్లు తెలిసింది. ప్రయాగ్‌రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్ లో రద్దీ కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు వారు చెప్పినట్లు సమాచారం.
Also Read: Hyderabad Crime: యూ బెగ్గర్ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!