/rtv/media/media_files/2025/03/15/VexUFh2nnZ974TCKUXCL.jpg)
Revanth Reddy
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్(BRS Party)) మనుగడపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm-revanthreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఒక చిట్ చాట్(revanth reddy chit chat) సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా వచ్చే రాజకీయ పార్టీల గురించి పక్కన పెడితే, ప్రస్తుతం ఉన్న పార్టీని ఉంచుతారో లేక మూసివేస్తారో కేసీఆర్(kcr) తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనే లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ పార్టీ ఆవశ్యకత ముగిసిపోయిందని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదని బీఆర్ఎస్ పరిస్థితిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి దించడంతోనే కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజలకున్న విముఖత స్పష్టమైందని, ఆ కుటుంబానికి కాలం చెల్లిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Also Read : బీఆర్ఎస్ ప్రక్షాళన... పాత కమిటీల రద్దు, సభ్యత్వ నమోదుపై కేసీఆర్ కీలక నిర్ణయం
Revanth Satire On Kavitha Party And KCR
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు వారిని ఆదరించినప్పటికీ, పదేళ్ల అధికారంలో అహంకారం, అహంభావంతో వ్యవహరించడం వల్లే ప్రజలు వారికి దూరమయ్యారని ముఖ్యమంత్రి విశ్లేషించారు. గత పదేళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి పెత్తనం చెలాయించారని, ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు లేదని కేవలం గతం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే ప్రస్తుతం అంతర్గత విభేదాలు తలెత్తాయని, ఆ కుంపటిని తమ మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలందరూ ఒకే బాటలో నడుస్తారని, వారిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తనపై జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే ఆస్తిపాస్తులు, అధికారం వారసులకే చెందుతాయి తప్ప తనకు వచ్చేది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ గానీ, ఆయన ఆస్తులు గానీ తనకు రావని, ఆయనకు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికే లబ్ధి చేకూరుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తనకు రాజకీయం సులభంగా ఉంటుందని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంమీద బీఆర్ఎస్ పార్టీకి ఇక పునర్వైభవం ఉండదని, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
Also Read : పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి... పట్టించుకోవద్దు.... కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Follow Us