తెలంగాణ ముఖ్యమంత్రి కుల గణన, ఎస్సీ వర్గీకల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరుగుతోంది. 2024 నవంబర్ 9 నుంచి 50 రోజులపాటు సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే నిర్వహించామని అన్నారు. ప్రతి 150 ఇళ్లను ఓ బ్లాక్‌గా తీసుకొని సర్వే చేశామని చెప్పారు. ఏడాది క్రితం కులగణన చేేస్తామని చెప్పా.. సంవత్సరంలోపే కులగణన చేశమని వివరించారు.
ఇది కూడా చదవండి :ఆ విషయంలో రేవంత్ దేశానికే ఆదర్శం.. చూసి నేర్చుకో చంద్రబాబు.. షర్మిల సంచలన ట్వీట్!
దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రిజర్వేషన్లు అమలులో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. పది సంవత్సరాలకు ఓ సారి నిర్వహించే జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు తెలియని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామని అసెంబ్లీలో వివరాలు వెల్లడించారు. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సర్వే చేయడానికి ముందు పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారని, ఆయా రాష్ట్రాల్లో లోటుపాట్లను గుర్తించి సరిచేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సర్వేపై 12 సార్లు సమీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 96.9 శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని తెలిపారు. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు వారి కుల వివరాలు తెలిపాయన్నారు. సర్వేలో 12 లక్షల కుటుంబాల వివరాలు సేకరించామని సభాముఖంగా ప్రకటించారు. సర్వేకు చట్టబద్దత కల్పించేందుకు కేబినెట్‌లో పెట్టి ఆమోదించామని ఆయన అన్నారు. సర్వే ప్రకారం.. సేకరించిన వివరాలు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
బీసీ జనాభా 46.25 %
ఓసీ జనాభా 17.79 %
ఎస్సీ జనాభా 17.43 %
ఎస్టీలు 10.45 %
బీసీ మైనార్టీలు 10.08 %