తెలంగాణలో సంధ్యా థియేటర్ ఘటన పెద్ద మార్పునే తీసుకువచ్చింది. ఆ సంఘటన తర్వాత తెలంగాణ ప్రుత్వం బెనిఫిట్, స్పెషల్ షోస్ ఉండవని...ఇకెట్ల రేట్లు కూడా పెంచమని చెప్పింది. సినీ పెద్దలు అందరూ వెళ్ళి మాట్లాడినా ససేమిరా అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఏ జరిగిందో ఏమో మళ్ళీ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌కు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది ప్రభుత్వం. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుంది.
హైకోర్టు ఆదేశాలు...
దీనిపై రీసెంట్‌గా హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత కూడా ఎలా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆనిపై పున: సమీక్షించాలని ఆదేశించింది.
Also Read: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ –సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
దీని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఇక బెనిఫిట్, స్పెషల్ షోలు ఉండవని...టికెట్ల రేట్ల సెపుకు అనుమతి ఇవ్వమని ప్రకటించింది. గేమ్ ఛేంజర్‌కు ఇచ్చిన అనుమతులను కూడా వెనక్కు తీసుకుంటున్నామని హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులిచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్లను సాధారణ రేట్లకే విక్రయించాలని ఆదేశించారు. ఇవే ఉత్తర్వులు రానున్న రోజుల్లోనూ అమలులో ఉంటాయన్నారు. ఎర్లీ మార్నంగ్ షోలకు కూడా అనుమతి ఇవ్వమని చెప్పారు.
Also Read: Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్‌లు పెంపు