/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nims-jpg.webp)
Nims Heart Surgery
NIMS Hospital: పుట్టుకతో చాలా మంది పిల్లలు గుండె సమస్యలతో(Heart problems) ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ(Aarogyasri), సీఎంఆర్ఎఫ్(CMRF) ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తూ ఎన్నో వేల గుండెలకు ఊపిరి పోస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రులు ఆపరేషన్ చేయలేకపోవడంతో నిమ్స్‌కి ఎక్కువగా మంది వెళ్తున్నారు. నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ రెండేళ్ల కిందట ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
నెలకు 35 సర్జరీల వరకు..
ఈ రెండేళ్లలో దాదాపుగా వెయ్యికి పైగా గుండె సంబంధిత సర్జరీలు చేశారు. వరల్డ్ క్లాస్ ఎక్విప్‌మెంట్, అనుభవజ్ఞులైన డాక్టర్లతో సర్జరీలు చేస్తున్నారు. నిమ్స్‌లో ఉచితంగా ట్రీట్మెంట్ చేయడంతో తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలకు నిమ్స్‌లో సర్జరీ చేయిస్తున్నారు. ఐసీయూ ప్రారంభ సమయంలో నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేశారు. ఇప్పుడు నెలకు సగటున 35 సర్జరీలు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
పుట్టిన వెంటనే శిశువులకు సర్జరీలు చేయడంతో పాటు ఏడాదికి, రెండేండ్లకు, ఐదేండ్లకు ఇలా సర్జరీలు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అలాంటి వారికి నిమ్స్ హాస్పిటల్ బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ శాతం మంది పిల్లలకు గుండెలో హోల్స్ పడటం, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, అబ్ నార్మల్ కనెక్షన్స్ వంటి సమస్యలు ఉన్న పిల్లలు వస్తున్నారట.
ఇది కూడా చూడండి: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
నిమ్స్‌లోని కార్డియో థోరాసిక్ హెచ్ వోడీ డాక్టర్ అమరేష్ రావు నేతృత్వంలోని డాక్టర్ ప్రవీణ్. డాక్టర్ గోపాల్ టీమ్ పిల్లలకు సర్జరీలు చేస్తున్నారు. పిల్లల్లో గుండె సర్జీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే వారు నిమ్స్ హాస్పిటల్‌లో ఓల్డ్ బిల్డింగ్‌లోని 6వ వార్డులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ అమరేశ్‌ను సంప్రదించవచ్చు. లేదా 78933 37836 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్
latest-telugu-news | hyderabad | Heart Surgery | nims-hospital | latest telangana news | telangana news today | telangana-news-updates | today-news-in-telugu