Latest News In Telugu Uttam Kumar : అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు TG: అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీ ఈ రోజు జరుగుతున్న చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. By Nikhil 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి TG: ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్స్ నీళ్లులేక ఎండిపోతున్నాయన్నారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Medigadda: మేడిగడ్డ సేఫ్.. బ్యారేజ్ పై నుంచి లైవ్ లో వివరించిన జగదీష్ రెడ్డి మేడిగడ్డ వద్ద ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి.. సూర్యాపేట జిల్లా కోదాడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగారు. పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు చేపట్టకుండా కుమార్తెలు ఆస్తి పంపకాల కోసం పట్టుపడటంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జయరాజ్ కు ఎమ్మెల్యే వీరేశం దంపతుల పరామర్శ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా గాయకుడు జయరాజ్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం-పుష్ప దంపతులు ఈ రోజు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ఆకాక్షించారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆర్ఆర్ఆర్ వేగవంతం చేయండి-మంత్రి కోమటిరెడ్డి జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చాలని..నల్లగొండ బైపాస్ రోడ్డును వేగంగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతంగా చేయాలని కోమటిరెడ్డి కోరారు. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రియాంకా గాంధీని కలిసిన సీఎం, మంత్రులు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు వివరించినట్లు తెలుస్తోంది. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Suryapet: మత్స్యశాఖలో అవినీతి చేప.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన డీఎఫ్‌వో! సూర్యాపేటలో అవినీతి అఫీసర్ రూపేందర్‌సింగ్ ఠాకూర్ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. కోటయ్య అనే మత్స్యకారుడి నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూపేందర్‌సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn