/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/bird-jpg.webp)
Bird flu: బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. గడిచిన వారం రోజుల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకి మరణించిన కోళ్లను జనవాసాలకు దూరంగా లేదా మట్టిలో కప్పివేయాలని కోళ్లఫారాలకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఓ వ్యక్తి చచ్చిన కోళ్లను చేపల చెరువులో పడివేయగా చేపలన్నీ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అక్కంపల్లి జలాశయంలో భారీ కోళ్ల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది.
60 కోళ్లను బయటికి తీసి..
ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతోపాటు నల్గొండ జిల్లాలోని 500 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న జలాయశంలో వందల సంఖ్యలో చచ్చిన కోళ్లు దర్శనవిమవ్వడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటే అధికారులకు సమాచారం ఇవ్వడంతో 60 కోళ్లను జలాశయంలో నుంచి బయటికి తీసి గుంతలో వేసి పూడ్చారు. ఈ ఘటనపై పీఏపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించారు.
ఇది కూడా చదవండి: Crime: భర్త పెళ్లికి రాలేదని భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత అతను మరీ ఘోరంగా!
నల్గొండ జిల్లా పడమటితండాకు చెందిన రామావత్ రాజమల్లు జలాయశంలో కోళ్లను పడేసినట్లు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. నీటి నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. ప్రజలకు ఎలాంటి హానీ జరగదని, జలాశయం సమీప గ్రామస్థులు ఆందోళన చెందకూడదని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi BJP : ఢిల్లీ సీఎం, మంత్రులు ఎవరు .. 15 మంది పేర్లు షార్ట్‌లిస్ట్!