Group 1: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందించారు. అభ్యర్థులు లేవనెత్తున్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వంతో సహా టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

New Update
MLC Kavita

MLC Kavita

గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై రాష్ట్రంలో దుమారం రేపుతోంది. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందించారు. గ్రూప్‌ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తున్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వంతో సహా టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు అభ్యర్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్ల చెప్పారు.  

Also Read: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ట్రాన్స్‌లేషన్ సమస్య ఉండటం వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, సరిగ్గా పరీక్ష పేపర్లు మూల్యంకనం చేయలేకపోయాని కవిత అన్నారు. దీనివల్ల మార్కుల్లో తేడాలు వచ్చాయని అందుకే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారంటూ పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కి ఒక హాల్‌టికెట్‌ నెంబర్, మెయిన్స్‌కి మరో హాల్‌ టికెట్‌ నెంబర్‌ను ఇవ్వడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

Also Read: వందేమాతరం పాట పాడిన మిజోరం చిన్నారి.. అమిత్ షా స్పెషల్ గిఫ్ట్

అలాగే ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో దాదాపు 13 వేల మంది అభ్యర్థులు ఫలితాలు వెల్లడించలేదని చెప్పారు. ఎందుకు 13 వేల మందిని ఇన్‌వాలిడ్‌గా ప్రకటించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా గ్రూప్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని 11 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. గ్రూప్ ఫలితాలపై వస్తున్న అనుమానాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని.. శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని అభ్యర్థులకు ఆమెకు విజ్ఞప్తి చేశారు.  

Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌

Also Read: తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు