Telangana: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష
గతేడాది అక్టోబర్ లో అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థి వరుణ్ రాజ్ హత్య కు గురైయ్యాడు.వరుణ్ ని చంపిన నిందితుడికి కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గతేడాది అక్టోబర్ లో అమెరికాలోని ఇండియానాలో తెలంగాణ విద్యార్థి వరుణ్ రాజ్ హత్య కు గురైయ్యాడు.వరుణ్ ని చంపిన నిందితుడికి కోర్టు 60 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
తెలంగాణలో కాలుష్యరహితంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు యత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని ఓ కాలనీలో తాంత్రికపూజలు చేస్తే సమస్యలన్నీ దూరమవుతాయంటూ మహిళకు మత్తు ఇచ్చిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ స్పృహలోకి వచ్చి అరవడంతో అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు.
ఖమ్మంలోని రేగళ్లపాడులో అవమాన భారంతో పాషా అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఫోన్ తీసుకున్న మిత్రుడు.. ఓ మహిళకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆమె భర్త పాషాపై దాడి చేశాడు. దీంతో అవమానంగా భావించిన అతను పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
TG: రేపు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని మహేష్ గౌడ్ కోరారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ను మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మల్లారెడ్డి కలిసి మనవరాలి వివాహానికి ఆహ్వానిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖమ్మం మున్నేరువాగులో హానికర రసాయనాలను వదులుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి రియాక్షన్ వల్ల ఐదు గ్రామాల ప్రజలు, చేపలు, పశువులు మృత్యువాత పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కెమికల్ ట్యాంకర్ ను పోలీసులు పట్టుకున్నారు.
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వనపర్తి, నారాయణపేట, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంతాలతండాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని కుటుంబ సభ్యులు, భర్త వేధింపులకు పాల్పడడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పిల్లలను కంటావా? నీచెల్లితో పెళ్లి చేస్తావా? అంటూ ఆ మహిళను భర్త టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది.