Telangana: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ లో వర్షాల గురించి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. జైల్లో ఉన్న స్నేహితుడిని కలిసి వస్తుండగా మద్యం సేవించి కెనాల్లోకి దిగారు. మద్యం మత్తులో ముగ్గురు కొట్టుకుపోగా ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా వారి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ పామాయిల్ రైతులకు దసరా కానుక అందించింది రేవంత్ సర్కార్. పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచింది. కాగా ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయిరాంతండాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డి మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు సింగరేణి సంస్థలో ఉద్యోగం కోసం రూ.16 లక్షలు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఆయన కొడుకు హర్షారెడ్డి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల ఖరీదైన పాటెక్ ఫిలిప్స్, బ్రెగ్యుట్ లగ్జరీ వాచ్లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మూడు కౌంటింగ్ మిషన్లను లోపలికి తీసుకెళ్లడంతో.. లోపల భారీ నగదు దొరికిందన్న ప్రచారం సాగుతోంది.
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశాల్లో ఉన్న సమయంలో ఆయన ఇంటికి కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. ఇద్దరు నిందితులను పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.